ముగ్గురు ఖైదీలను కాటేసిన పాము

జైల్లో పాము కాటుకు ఒక ఖైదీ బలవ్వగా మరో ఇద్దరు ఖైదీలు ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని లక్నో జిల్లా జైల్లో జరిగింది. యూపీలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లక్నో జిల్లా జైలు నీళ్లతో నిండి పోయింది. ఆ నీటిలో పాములు కొట్టుకు వచ్చాయి. అక్కడ జీవిత ఖైదు అనుభవిస్తున్న బబ్బు, దిలీప్, రాజ్ కుమార్ అనే ఖైదీలను పాము కాటు వేసింది. బబ్బు మరణించగా మిగతా ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  వారిద్దరు ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నారని డాక్టర్లు చెప్పారు. ఈ ఘటనపై స్పందించిన జైలర్ సతీష్ చంద్ర పాములు పట్టేవాళ్లను రప్పించామని.. వారు నాలుగు పాములను పట్టారని చెప్పారు.

Latest Updates