అరుదైన పాములు, బల్లులు అక్రమ రవాణా

మలేషియా నుంచి చెన్నైకు పలురకాల పాములను, బల్లులను అక్రమరవాణా చేస్తున్న వారిని పట్టుకున్నారు చెన్నై ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అధికారులు. మలేషియానుంచి చెన్నైకు పురకాల పామును ఇద్దరు వ్యక్తులు అక్రమరవాణా చేస్తున్నట్లు చెన్నై ఎయిర్ పోర్ట్ అధికారులకు సమాచారం అందించారు మలేషియన్ కస్టమ్స్ అధికారులు. తమిళనాడు రామనాథపురానికి చెందిన మహమ్మద్ పర్వేజ్(36), శివగంగకు చెందిన మహమ్మద్ అక్బర్(28) లు మలేషియా నుంచి చెన్నై ఎయిర్ పోర్ట్ కు చేరుకోగా… తనికీ చేసిన కస్టమ్స్ అధికారులు వారి దగ్గర నుంచి పలు రకాల బల్లును, పాములను స్వాధీనం చేసుకున్నారు. వండలూర్ పార్క్ డాక్టర్లను పిలిపించి టెస్ట్ చేయించగా పాములు, బల్లులు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. మొత్తం 13 పాములు, బల్లులు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో ఆకు పచ్చ వడ్రంగి పిట్ట, విషపూరిత పాము, పల్ల కలప బల్లి, భూమి కలప బల్లి ఉన్నట్లు తెలిపారు. వాటిని తిరిగి మలూషియాకు పంపాలని నిర్ణయించుకున్నట్లు అధికారులు చెప్పారు. వీటిని చెన్నై కు ఎందుకు రవాణా చేస్తున్నారనే కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

Latest Updates