భూముల నక్షాలు గాయబ్!

రాష్ట్రంలో నక్షాలు లేని లక్ష్మాపూర్ లాంటి గ్రామాలు 119

రెవెన్యూ, సర్వే అండ్‌ల్యాండ్‌ రికార్డ్స్ విభాగాల్లో దొరకని వివరాలు
మేడ్చల్, రంగారెడ్డి జిల్లాకు చెందిన రెవెన్యూ గ్రామాలే ఎక్కువ
టిప్పన్ల కోసం వచ్చి అవి దొరక్క వెనుదిరిగి వెళ్లిపోతున్న జనం
పట్టించుకోని సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని రైతులకు, రెవెన్యూ, ల్యాండ్ అండ్ సర్వే విభాగం అధికారులకు ఎంతగానో ఉపయోగపడే భూమి మ్యాప్లు కొన్ని గ్రామాల్లో మాయమయ్యాయి. సర్వే నంబర్ల వారీగా భూముల ఆకారాన్ని, అవి ఎక్కడెక్కడ ఉన్నాయన్న విషయాన్ని తెలిపే గ్రామ నక్షాలుకొన్ని కనిపించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 119 గ్రామాలకు చెందిన నక్షా(గ్రామానికి సంబంధించిన సకల వివరాలు నమోదై ఉన్న రికార్డు)లు, టిప్పన్లు(భూముల సరిహద్దులు తెలిపే రికార్డులు) లేకుండాపోయాయి. భూ రికార్డులతోపాటు సర్వే మ్యాపుల డిజిటలైజేషన్ సందర్భంగా మూడేండ్ల క్రితమే ఈ విషయాన్ని అధికారులు గుర్తించినా.. ఇప్పటి వరకు ఒక్క గ్రామానికి కూడా భూసర్వే చేసి కొత్త మ్యాపును రూపొందించలేదు. తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్యాలయాల్లో భద్రంగా ఉండాల్సిన టిప్పన్లు రెండు, మూడు దశాబ్దాల క్రితం నుంచే లేకుండాపోయాయని సర్వే అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ల్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రికార్డ్సు అధికారులు చెబుతున్నారు. కనిపించని నక్షాల్లో రంగారెడ్డి జిల్లాకు చెందిన రెవెన్యూ గ్రామాలవే ఎక్కువగా ఉండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కొత్త మ్యాపులు సిద్ధం చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా ఆమోదం రాలేదని తెలుస్తోంది.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే ఎక్కువ
భూ భారతి ప్రాజెక్టులో భాగంగా సమగ్ర భూసర్వే చేపట్టిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మినహా ఇతర జిల్లాల్లోని చాలా గ్రామాల నక్షాలు లేవని తెలిసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో అత్యధికంగా 65 రెవెన్యూ గ్రామాలకు సంబంధించిన నక్షాలు అందుబాటులో లేవని సమాచారం. ఇందులో మేడ్చల్ జిల్లాకు చెందినవి 28 ఉండగా, రంగారెడ్డి జిల్లాకు చెందినవి 37 ఉన్నాయి. వీటిలో రియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యాపారం జోరుగా నడిచే రాజేంద్రనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హయత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మోయినాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, షాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కొత్తూరు, శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి తదితర రెవెన్యూ గ్రామాలున్నాయి. ఈ గ్రామాల పరిధిలోని భూ నక్షాలు మాయం కావడం వెనక కబ్జాదారుల హస్తం ఉందనే ఆరోపణలున్నాయి. మేడ్చల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలోని 43 గ్రామాల్లో భూముల విస్తీర్ణం, యాజమాన్యం గురించి వెల్లడించే నిజాం కాలం నాటి సేత్వార్ రికార్డులూ లేవని తెలిసింది.

ఎవరి దగ్గరా నక్షాల నకళ్లు లేవు
నిజానికి గ్రామ నక్షాల నకళ్లు ఆ గ్రామ వీఆర్వో దగ్గర, తహసీల్దార్ కార్యాలయంలో, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయాల్లో ఉండాలి. కానీ ప్రస్తుతం ఏ ఆఫీసులోనూ లేవు. డిజిటలైజేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సందర్భంలో తహసీల్దార్లను ఆయా ఊర్ల నక్షాలను పంపాలని సర్వే అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ల్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రికార్డ్స్ అధికారులు కోరగా వారు తమ వద్ద లేవని చేతులేత్తేసినట్లు తెలిసింది. భూ వివాదాలు తలెత్తినప్పుడు బాధితులు సర్వే అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ల్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రికార్డ్స్ ఆఫీసులకు వచ్చి టిప్పన్ల కోసం దరఖాస్తులు ఇస్తే వారికే ఏ సమాచారం లభించట్లేదు. సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన లక్ష్మాపూర్ నక్షా కూడా లేకపోవడంతో మూడేండ్ల క్రితమే రూపొందించాలని ఆదేశించారు. అధికారులు నక్షా రూపొందించినా వంద ఎకరాల భూమి తేడా రావడంతో సమస్య మొదటికొచ్చింది. ఇస్రోలాంటి సంస్థల సాంకేతిక పరిజ్ఞానంతో సర్వే చేస్తే కరెక్టు రిజల్ట్ ఉంటుందని, 119 గ్రామాల్లోనూ ఇదే పద్ధతిలో రీ సర్వే చేసి కొత్త నక్షాలు రూపొందించడం తప్ప మరో మార్గం లేదంటున్నారు.

మచ్చుకు కొన్ని ఊళ్లు..
మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని చిన్నపర్వతపూర్, లక్ష్మాపూర్, ఘట్కేసర్ మండలంలోని ఎదులాబాద్, ఇస్మాయిల్ గూడ, కాచవాని సింగారం, మర్రిపల్లి గూడ, కీసర మండలం నర్సంపల్లె, యాద్గార్పల్లి (పశ్చిమ), మేడ్చల్ మండలంలోని షహజాది గూడ, మేడిపల్లి మండలంలోని మేడిపల్లి, మియాపూర్, ఫీర్జాదిగూడ, శామీర్ పేట మండలం పొన్నాల్, తూంకుంట, బండ్లగూడ, ఉప్పల్ మండలం నాచారం, నౌరంగ్ గూడ బగాయత్, ఉప్పల్ బగాయత్, ఉప్పల్ ఖాల్సా, అల్వాల్ మండలం అక్బర్ జా, లోతుకుంట, బాలానగర్ మండలం జింకల్ వాడీ, గండిమైసమ్మ, దుండిగల్ మండలం శంభూపూర్, కూకట్ పల్లి మండలంలోని బాగ్ అమీర్, కూకట్పల్లి, మూసాపేట, మల్కాజిగిరి రెవెన్యూ గ్రామాల నక్షాలు లేవు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని చన్వెల్లి, చేవెళ్ల, గుండాల, కేసారం, మీర్జాగూడ, న్యాలట, మోయినాబాద్ మండలంలోని ముర్తుజగూడ–2, చాకలిగూడ, దేవులపల్లి, కంచమోని గూడెం, కాసింబౌలి, మోయినాబాద్, ఎల్కగూడ, షాబాద్ మండలంలోని అనంతవరం, ఎట్లేరవల్లి, హైతా బాద్, కొమరబండ, మన్మర్రి, రంగాపూర్, శంకర్పల్లి మండలం మాసానిగూడ, పర్వేద ఖాల్సా, రామంతాపూర్, సంకేపల్లి పైగా, ఎర్వగూడ, అబ్దుల్లాపూర్మెట్ మండలం అక్బర్ జా, బండరావిర్యాల్, లస్కర్గూడ, తట్టిఖానా రెవెన్యూ గ్రామాల నక్షాలు సీసీఎల్ఏ వెబ్సైట్లో అందుబాటులో లేవు.

కెడస్ట్రల్ మ్యాపుల్లో కచ్చితత్వం తక్కువే
రాష్ట్రంలో 10,730 గ్రామాల నక్షాలు, టిప్పన్ల డిజిటలైజేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తయ్యింది. సీసీఎల్ఏ వెబ్సైట్లో ప్రజలంతా చూసేలా వీటిని గూగుల్ భువన్ ఇమేజ్ మ్యాపు ఆధారంగా సెట్ చేశారు. గ్రామాల వారీగా ఉన్న ఈ కెడస్ట్రల్ మ్యాపుల్లోని ఏదైనా సర్వే నంబర్పై క్లిక్ చేస్తే ఆ నంబర్లోని భూమెంత, బై నంబర్ల వారీగా ఎవరి పేరిట ఎంతుందో కనిపిస్తాయి. చాలా చోట్ల రెండు సర్వే నంబర్ల మధ్య సరిహద్దులు కొంచెం అటుఇటుగా చూపుతున్నాయని ఆరోపణలున్నాయి. మండల స్థాయిలో సర్వేయర్లు ఆ మ్యాపులనే ప్రామాణికంగా తీసుకోవడంతో కొందరు రైతులు, భూమి యజమానులకు నష్టం జరుగుతుందనే విమర్శలు ఉన్నాయి. కెడస్ట్రల్ మ్యాపులపై ఫిర్యాదులను తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దరఖాస్తు చేసి పరిష్కారం పొందొచ్చని సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్సు అధికారి చెప్పారు.

మా ఊరి నక్షా లేదు
మా ఊరిలో వ్యవసాయ భూములకు సంబంధించిన నక్షా లేదు. ఎవరి భూముల్లో వాళ్లే వ్యవసాయం చేసుకుంటున్నప్పటికీ ఎప్పుడైనా ఇద్దరు రైతుల మధ్య గట్టు పంచాయితీ వస్తే భూములు కొలవడం ఇబ్బందిగా మారింది. అందుకే గ్రామ పాత నక్షా ఎవరైనా రిటైర్డ్ రెవెన్యూ అధికారుల దగ్గరో, ఆఫీసుల్లోనో ఎక్కడుందో వెతకాలి. లేదంటే కొత్త నక్షా తయారు చేసి భవిష్యత్లో ఇబ్బందులు కలగకుండా శాశ్వత పరిష్కారం చూపాలి.
-కొత్త రవీందర్ రెడ్డి,
నర్సింహులపేట, మహబూబాబాద్

For More News..

సింగపూర్ ‘టోకెన్ ట్రేసింగ్’

రోజూ 24 కి.మి. సైకిల్‌‌పై బడికి.. టెన్త్‌‌లో టాప్‌‌ సాధించిన రైతు బిడ్డ

పట్నం కొలువు పాయె.. ఊర్ల పనులే ఆసరాయె..

Latest Updates