20 వేల ఏండ్ల కిందటి అలుగు.. చెక్కుచెదరని దేహం

బండరాయి కాదు.. అలుగు!

తవ్వకాల్లో బయటపడిన పెద్ద బండరాయిని ఓ ఆర్కియాలజిస్టు పరిశీలిస్తున్నారని అనిపిస్తోంది కదూ ఈ ఫొటో చూస్తుంటే..? కానీ.. ఇది బండరాయి కాదు. వోక్స్ వ్యాగన్ కారంత సైజులో ఒకప్పుడు భూమిపై తిరుగాడిన ఆర్మడిల్లో అనే జీవి! ఈ ఆర్మడిల్లో బతికున్నప్పుడు కుడివైపు ఫొటోలో ఉన్నట్లే భీకరంగా ఉండేదట. దక్షిణ అమెరికాలోని అర్జెంటినా రాజధాని బ్యూనస్ ఏర్స్ సమీపంలో ఎండిపోయిన ఓ నది ప్రాంతంలో జువాన్ డీ డియో సోటా అనే రైతు ముందుగా రెండు వింత ఆకారాలను గుర్తించాడు. ఆర్కియాలజిస్టు పాబ్లో మెస్సినో టీంకు సమాచారం చేరవేశాడు. వాళ్లొచ్చి తవ్వేసరికి మరో రెండు ఆకారాలు బయటపడ్డాయి. పూర్తిగా పరిశీలించిన తర్వాత ఇవి గ్లిప్టోడాంట్స్ శిలాజాలని కన్ఫమ్ చేశారు.

ఇప్పటికాలంలో ఒళ్లంతా పొలుసులతో చిన్నగా ఉండే అలుగు (ఆర్మడిల్లో) జీవులకు గ్లిప్టోడాంట్స్ పూర్వీకులని మెస్సినో వెల్లడించారు. ఇవి 20 వేల ఏండ్ల కిందట పేలియోస్టీన్ యుగంలో నార్త్, సౌత్ అమెరికాల్లో ఉండేవని తెలిపారు. ప్రస్తుతం దొరికిన నాలుగు శిలాజాల్లో రెండు పెద్దవి, రెండు చిన్నవి ఉన్నాయని, తాబేలు మాదిరిగా వీటి శరీరంపై 2 ఇంచుల మందం, 5 అడుగుల పొడవైన గుల్ల ఉందన్నారు. గుల్లపై పొలుసులు ఉండటంతో పాటు తోకపై ముండ్ల వంటివి ఉండేవని, వాటితో శత్రువులను కొట్టేవని వివరించారు. ఈ నాలుగూ ఒకేవైపు వెళుతుండగా, అకస్మాత్తుగా, అక్కడికక్కడే చనిపోయినట్లు చెప్పారు. అయితే, వీటిలో ఏవి ఆడవి? ఏవి మగవి? ఇవి ఎందుకు చనిపోయాయి? అన్న వివరాలు మరింత స్టడీ చేశాకే తెలుస్తాయన్నారు.

For More News..

వాషింగ్టన్‌లో ల్యాండవ్వగానే భారత టూర్‌పై ట్రంప్ ట్వీట్

చెట్టు కింద ఆఫీసర్!

మంగమ్మా.. ఏందమ్మా మీ సమస్య? కలెక్టర్‌నంటూ పరిచయం చేసుకొని..

Latest Updates