సోమాలియా రెఫరీకి నో ఎంట్రీ.. రేపటి (జూన్ 11) నుంచి సాకర్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌

సోమాలియా రెఫరీకి నో ఎంట్రీ.. రేపటి (జూన్ 11) నుంచి సాకర్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌

మొగాదిషు: సాకర్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో చరిత్ర సృష్టించాలనుకున్న సోమాలియా టాప్‌‌‌‌‌‌‌‌ రెఫరీ ఒమర్‌‌‌‌‌‌‌‌ ఆర్తన్‌‌‌‌‌‌‌‌కు ఊహించని షాక్‌‌‌‌‌‌‌‌ తగిలింది. టోర్నీలో రెఫరీ బాధ్యతలు నిర్వర్తించేందుకు అమెరికా చేరుకున్న అతన్ని ఇమ్మిగ్రేషన్‌‌‌‌‌‌‌‌ అధికారులు అడ్డుకున్నారు. సరైన వీసా ఉన్నా.. యూఎస్‌‌‌‌‌‌‌‌లోకి ఎంట్రీ కాకుండా మయామి ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌లోనే ఆపేశారు. 

భద్రతా తనిఖీల కారణాల వల్లే అతడిని దేశంలోకి అనుమతించలేదని ఇమ్మిగ్రేషన్‌‌‌‌‌‌‌‌ అధికారులు తెలిపారు. ఆఫ్రికా ఖండంలోనే అత్యుత్తమ రెఫరీగా గుర్తింపు పొందిన ఆర్తన్‌‌‌‌‌‌‌‌ 2025లో బెస్ట్‌‌‌‌‌‌‌‌ రెఫరీ అవార్డును కూడా అందుకున్నాడు. దాంతో వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు ఆడించిన తొలి సోమాలియా రెఫరీగా చరిత్ర సృష్టించాలని ఆర్తన్‌‌‌‌‌‌‌‌ భావించాడు.