శ్రీలంకలో సోషల్ మీడియాపై బ్యాన్

కొలంబో: శ్రీలంకలో ఉగ్రవాదుల మారణ హోమం సృష్టించడంతో.. ఆ దేశంలో హై అలర్ట్ కొనసాగుతోంది. కొలంబోలో ఈ ఉదయం నుంచి 8 పేలుళ్లు జరిగాయి. ఇప్పటికే 166 మంది చనిపోయినట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. వందల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. పేలుళ్ల సమాచారంతో ఆ దేశంలోని ప్రజలు భయంతో వణికిపోతున్నారు. దీంతో.. సోషల్ మీడియాలో వదంతులు కూడా వైరల్ గా మారాయి. పలు నగరాల్లో పేలుళ్లు జరగబోతున్నాయంటూ పుకార్లు షికారు చేస్తుండటంతో… జనంలో ఆందోళన పెరిగిపోతున్న పరిస్థితి. దీంతో.. అక్కడి హోంశాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాపై తాత్కాలికంగా నిషేధం విధించింది. ప్రభుత్వం ఇస్తున్న అధికారిక ఉత్తర్వులనే నమ్మాలని.. వదంతులు నమ్మొద్దని దేశ ప్రజలను కోరింది. 

కొలంబోలో ఈ రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్టు ఆ దేశ హోంశాఖ ప్రకటించింది.

పదిరోజుల ముందే వరుస బ్లాస్ట్ లపై ఇంటలిజెన్స్ సమాచారం ఉన్నప్పటికీ… ఆ పేలుళ్లను అక్కడి ప్రభుత్వం ఆపలేకపోయింది.

Latest Updates