సోషల్ మీడియా ప్రభావం.. 5 శాతం ఓటర్లపైనే!

లోక్‌ సభ ఎన్నికలపై సోషల్ మీడియా ప్రభావం ఎంత మేర ఉందంటే కేంద్ర ఎన్నికల సంఘం కూడా దీని పై ఫోకస్ పెట్టే పరిస్థితి వచ్చింది. ఫేస్ బుక్, వాట్సప్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాపై నిఘా పెడతామని, నకిలీ వార్తలను కట్టడి చేస్తామని ఈసీ ప్రకటించింది. 2014 ఎన్నికల్లో సోషల్ మీడియాను బలంగా వాడుకున్న నరేంద్ర మోడీ, యువతకు దగ్గరై ప్రధాని పదవి చేపట్టారు . ఇప్పటికీ సోషల్ మీడియాలో ఆయనకు క్రేజ్ ఎక్కువే.

కాంగ్రెస్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారింది. ఈ సారి ఏడు దశల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రభావం ఎంత మేర ఉంటుందనే చర్చ మొదలైంది. దీని పై ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ వో టీవీ మోహన్ దాస్ హైదరాబాద్ లో స్పందించారు. ఎక్కువలో ఎక్కువ 5 శాతం ఓటర్లపైనే సోషల్ మీడియా ప్రభావం కచ్చితంగా ఉంటుందన్నారు . కొన్ని నియోజకవర్గా ల్లో అభ్యర్థుల గెలుపునకు ఇది కీలకాంశం కానుందని చెప్పారు . యువత అందులోనూ తొలిసారి ఓటర్లుగా పేరు నమోదు చేసుకున్నవారు సోషల్ మీడియాలో ఎక్కువగా ఉన్నారని, సమాచారం కోసం వాళ్లు దానిపైనే ఆధారపడి ఉంటారని దాస్‌ పేర్కొన్నారు . “ప్రస్తుతం యూత్ ఎక్కువగా టీవీ చూడరు. వాళ్లు వీడియోలు చూస్తారు. యూట్యూబ్ చూస్తారు, సోషల్ మీడియాను ఫాలో అవుతారు. వాళ్లు న్యూస్ పేపర్లు చదవరు, సోషల్ మీడియాలో సమాచారం వారిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ప్రింట్ మీడియా, టీవీ మీడియా ప్రభావం తక్కువే” అని దాస్‌ వ్యాఖ్యానించారు. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో యువత, మహిళలు, రైతులతోపాటు అన్ని వర్గా ల ప్రజకు చేరువయ్యేందుకు రాజకీయ పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి.

ఒకప్పుడు కేవలం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు మాత్రమే పార్టీలకు అండగా నిలిచేవి. కానీ ఇప్పుడు వాటికన్నా బలమైన, కొన్ని క్షణాల్లో కోట్ల మందికి సమాచారం చేరవేయగల సోషల్ మీడియా పార్టీలకు వేదికగా మారింది. ముఖ్యం గా యువతను చేరుకోవాలంటే పార్టీలు ఈ బాటలోకి రావడం తప్పనిసరి అయ్యింది. “మెసేజ్ లు వాళ్ల ఇంట్రెస్ట్ కు అనుగుణంగా ఉండాలి, మెసేజ్ లు గ్రూప్ లను చేరేలా ఉండాలి. ఆ మెసేజ్ లు పాజిటివ్ గా ఉండాలి. భవిష్యత్తుపై ఆశలు కలిగించేలా ఉండాలి. ఉదాహరణకు ప్రపంచవ్యాప్తంగా ఇండియాను ఎలా చూస్తారు అనేదానిపై యువత ఎక్కువ ఆసక్తిగా ఉంది. విదేశాల్లో పని చేసేందుకు వారు ఆసక్తిగా ఉండటమే దీనికి కారణం” అని దాస్‌ అభప్రాయపడ్డారు . యువ ఓటర్లను ఆకట్టుకునే విషయంలో ఏ పార్టీ ముందుందు అని అడిగిన ప్రశ్నకు బీజేపీ అని మోహన్ దాస్ పై అన్నారు . ప్రధాని నరేంద్ర మోడీ పేరు యువతలో బలంగా ఉందన్నారు . ఈ విషయంలో రాహుల్ గాంధీ వెనుకబడి ఉన్నారని, ఆయన ఇంకా 1990 నాటి భాషనే మాట్లాడుతున్నారని దాస్‌ ముక్తాయించారు.

Latest Updates