యాచకురాలికి ఆఫర్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్

టైం వస్తే ఓడలు బండ్లు.. అవుతాయి.. అనడానికి ఈ సంఘటనే నిదర్శనం. ఒకప్పుడు ఆమె రైల్వే స్టేషన్ లో పాటలే పాడుతూ అడుక్కుతినేది. అయితే ఆమె స్వరం..ఆమెకు గాడ్ గిఫ్ట్. అదే ఆమె లైప్ కు టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఒక్క పాటనే ఆమె జీవితాన్ని మార్చేసింది.

వివరాలు.. పశ్చిమ బెంగాల్‌ లోని నదియా జిల్లాలోని రాణాఘట్ రైల్వే స్టేషన్‌లో రాణు మరియా ముండల్ అనే యాచకురాలు.. లతా మంగేష్కర్ ఆలపించిన ‘‘ఏక్ ప్యార్ కా నగ్‌మా హే’’ పాటను పాడి వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆమె అద్భుతమైన గాత్రానికి బాలీవుడ్ సైతం ఫిదా అయిపోయింది. దీంతో ఆమె రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిపోయింది.

ఇటీవల ఈ గాన కోకిలను ఓ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ గుర్తించింది. దీంతో ఆమె తొలిసారిగా ముఖానికి మేకప్ వేసుకుంది. యాచకురాలి రూపం నుంచి సింగర్ అవతారమెత్తిన ఆమె.. ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ సింగర్, యాక్టర్ హిమేష్ రెషమ్మియాతో కలిసి పాడుతూ ఔరా అనిపిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ట్యాలెంట్ ఎవ్వరి సొంతం కాదని..టైం వస్తే అదే బయటపడుతుందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Latest Updates