పాకిస్థాన్ ‘ల్యాండ్ ఆఫ్ పీస్’ అంట.. ఫుల్ ట్రోలింగ్

పాకిస్థాన్ అనగానే.. ఎవరైనా పేలుళ్ల దేశం… బ్లాస్టింగ్ కి కేరాఫ్ .. టెర్రర్ అడ్డా అనే అంటారు. ప్రపంచంలోని ఎవరినడిగినా.. అదే మాట. కానీ.. ఆ దేశం ఆ మాట ఒప్పుకోకపోయినా ఫర్వాలేదు కానీ… అతిశయోక్తి అనిపించే మరో మాట చెబుతోంది. ఏకంగా… తమది శాంతియుత దేశం(Land Of Peace) అని అని చెబుతోంది.

బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియం, కేంబ్రిడ్జ్ యువరాణి కేట్ మిడిల్ టన్ 5రోజుల పర్యటనకోసం పాకిస్థాన్ కు వెళ్లారు. ఇస్లామాబాద్ ఎయిర్ పోర్టులో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. రాయల్ కపుల్ కు వెల్కమ్ చెప్పారు. ఇదే సందర్భాన్ని ట్విట్టర్ లో అప్ డేట్ చేసింది ఆ దేశ సమాచార శాఖ. ” శాంతియుత నేల అయిన పాకిస్థాన్ గడ్డపైనుంచి… మేం రాయల్ కపుల్ కు స్వాగతం చెబుతున్నాం.” అని కామెంట్ పెట్టింది.

ఆ పోస్ట్ కింద కామెంట్లు మామూలుగా లేవు. బిన్ లాడెన్ లాంటి ఉగ్రవాదులకు పుట్టినిల్లు అయిన పాకిస్థాన్ ల్యాండ్ ఆఫ్ పీస్ ఏంటి అంటూ ఉతికి ఆరేస్తున్నారు ఇంటర్నెట్ యూజర్లు. పీస్(Peace) అంటే ఇంగ్లీష్ లో స్పెల్లింగ్ తప్పు ఇచ్చారని.. ముక్కలు(piece) ముక్కలు చేసే దేశం అది అని మరొకరు అన్నారు.

Latest Updates