కలెక్టర్ గారు మాస్క్ పెట్టుకోండి ప్లీజ్

నిర్మల్ జిల్లా కలెక్టర్ ముష్రాఫ్ ఆలీకి మాస్కుల్ని పోస్టులో పంపించారు జిల్లా సామాజిక కార్యకర్త కస్తాల అరుణ్. అధికారులు, ప్రజలతో సమావేశమైనప్పుడు కలెక్టర్ మాస్కులు పెట్టుకోవడం లేదనీ.. అందుకే పంపించినట్లు చెప్పారు. తాను పంపిన మాస్కులని రెగ్యులర్ గా ధరించాలని రిక్వెస్ట్ చేశారు అరుణ్.  కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన కలెక్టరే మాస్కు ధరించకపోవడం కరెక్ట్ కాదన్నారు. నిర్మల్ జిల్లాలో కరోనాని కంట్రోల్ చేయడంలో జిల్లా యంత్రాంగం ఫెయిల్ అయ్యిందని విమర్శించారు అరుణ్.

 

Latest Updates