ప్ర‌జాసేవ‌కు సిద్ధ‌మంటున్న సంఘ‌సేవ‌కుడు.. పారిశుధ్య సిబ్బందికి చీర‌ల పంపిణీ

పేద ప్రజలకు సేవ చేయడానికి తాను ఎన్నటికీ సిద్దంగా ఉంటానని అన్నారు ప్రముఖ సంఘ సేవకులు వేణుగోపాల్. శుక్రవారం ఆయ‌న జన్మదిన సందర్భంగా ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, కార్పొరేటర్లు పావని లు పాల్గొన్నారు.

ప్రశాంత్ నగర్, కాప్రాలో బ్లడ్ డొనేషన్ క్యాంప్, సాయిరాం నగర్, ఇందిరానగర్, సాయి బాబా న‌గ‌ర్‌ల‌లో ఉచిత కంటి పరీక్షలు, జనరల్ హెల్త్ క్యాంప్, కాప్రా, గాంధీ నగర్ కమ్యూనిటి హాల్లో ఉచిత కంటి పరీక్షలు, జనరల్ చెకప్, నిర్మల్ నగర్, కందిగూడ ప్రభుత్వ పాఠశాలలో ఉచిత కంటి పరీక్షలు, జనరల్ చెకప్‌లు వంపుగూడలో ఉచిత కంటి పరీక్ష, జనరల్ చెకప్‌ల‌తోపాటు ప్రతి ఏరియాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. 100 మంది పారిశుధ్య సిబ్బందికి చీరలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడం, ఆపదలో ఉన్న పేదవారిని ఆదుకునే ఇలాంటి నాయకులను ఆదరించాలన్నారు. అలాగే టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం, పార్టీ అభివృద్ధికి కృషి చేయడం హర్షనీయమన్నారు. రానున్న రోజుల్లో మరిని కార్యక్రమాలు నిర్వహించాలని, ఆయనకు పూర్తి మద్దతు ఇవ్వడానికి ఎల్లవేళలా సిద్దంగా ఉంటామన్నారు.

Latest Updates