‘సోషల్‌‌‌‌ ఆడిట్‌‌‌‌’ ఎంప్లాయిస్‌‌‌‌ సమ్మె

  • 26 నుంచి ధర్నాచౌక్‌‌‌‌లో దీక్షలు

ఉపాధి హామీ పథకంతోపాటు వివిధ గవర్నమెంట్‌‌‌‌ స్కీంల అమలును తనిఖీ చేసే  సొసైటీ ఫర్‌‌‌‌ సోషల్‌‌‌‌ ఆడిట్‌‌‌‌ఎంప్లాయీస్‌‌‌‌ సమ్మెకు దిగారు. దీంతో పలు మండలాల్లో సోషల్‌‌‌‌ ఆడిట్‌‌‌‌లు నిలిచిపోయాయి. సొసైటీ ఫర్‌‌‌‌ సోషల్‌‌‌‌ ఆడిట్‌‌‌‌, అకౌంటబులిటీ అండ్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌ఫరెన్సీ (ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఏఏటీ) సంస్థలో 32 జిల్లాల్లో కాంట్రాక్ట్‌‌‌‌ పద్ధతిన 48 మంది డిస్ట్రిక్ట్‌‌‌‌ రిసోర్స్‌‌‌‌ పర్సన్లు, 438 మంది బీఆర్‌‌‌‌పీలు 2007 నుంచి పనిచేస్తున్నారు. శాలరీలు పెంచాలని, వీఎస్‌‌‌‌ఏ, బీఆర్‌‌‌‌పీ, డీఆర్‌‌‌‌పీలకు డీఏ రూ.250 ఇవ్వాలని, నో వర్క్‌‌‌‌ నో పే రూల్‌‌‌‌ తీసేయాలని.. తదితర 20 డిమాండ్లతో కొన్నాళ్లుగా వీరు ఆందోళన చేస్తున్నారు. సమ్మెకు దిగుతున్నట్టు ఈ నెల 8నే ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఏఏటీ డైరెక్టర్‌‌‌‌కు నోటీస్‌‌‌‌ ఇచ్చినా స్పందించక లేకపోవడంతో సమ్మెకు దిగారు. ఈ నెల 26 నుంచి హైదరాబాద్‌‌‌‌లోని ధర్నా చౌక్‌‌‌‌లో రిలే నిరాహారదీక్షలు చేయబోతున్నట్టు డిస్ట్రిక్ట్‌‌‌‌ రిసోర్స్‌‌‌‌ పర్సన్‌‌‌‌ కే.ప్రభాకర్‌‌‌‌ వెల్లడించారు.

పనిలోకి రాకుంటే కాంట్రాక్టు రద్దు

సమ్మె చేస్తున్న ఉద్యోగులకు ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఏఏటీ డైరెక్టర్‌‌‌‌ సౌమ్య కిలంబీ 17న నోటీసులు పంపారు. నోటీసులందిన ఏడు రోజుల్లో పనిలోకి రాకుంటే నిబంధన ప్రకారం కాంట్రాక్ట్‌‌‌‌ రద్దు చేస్తామని హెచ్చరించారు. డిమాండ్ల పరిష్కారం డైరెక్టర్‌‌‌‌ పరిధిలో లేదని, ఎగ్జిక్యూటివ్‌‌‌‌ కమిటీ/ గవర్నింగ్‌‌‌‌ బాడీల పరిశీలనకు పంపుతున్నట్టు చెప్పారు.