హ్యాక్‌ చేసి.. కోట్లు దోచేసి

హైదరాబాద్‌‌లో మరో హ్యాకింగ్‌ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఓ హ్యాకర్‌‌ చేతివాటం ప్రదర్శించి ఓ కంపెనీ మెయిల్‌‌ను హ్యాక్‌‌ చేశాడు. ఆ కంపెనీకి రావాల్సిన రూ.8.64 కోట్లను స్వాహా చేశాడు. విషయం తెలుసుకున్న ఆ కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సైబరాబాద్‌‌ కమిషనరేట్‌‌ పరిధిలో జరిగిందీ ఘటన. కొండాపూర్‌‌లోని వోల్టాల్‌‌ ఎంప్లెక్స్‌‌ ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌ కంపెనీ ఇంజినీరింగ్‌ సరుకులు ఎగుమతి చేస్తుంటుంది. ముఖ్యంగా ఆఫ్రికాలోని డైమండ్‌‌ సిమెంట్‌‌ కంపెనీతో ఎక్కువగా వ్యాపారం జరుగుతుంటుంది. డైమండ్‌‌ సిమెంట్‌‌ ఉద్యోగి తమిళ్‌ వెన్నంతో వోల్టాల్‌‌కు చెందిన మురళీకృష్ణ నిత్యం సంప్రదింపులు జరుపుతుంటారు. తాము పంపిన సామగ్రి బిల్లులు చెల్లించాలని తరచూ మెయిల్‌‌లో కోరుతుంటారు. 2018 డిసెంబర్‌‌లోనూ ఇలానే మెయిల్‌‌ పంపారు. కానీ డైమండ్‌‌ సిమెంట్స్‌‌ వారు స్పందించకపోవడంతో మురళీకృష్ణ మరో ఉద్యోగిని అడగ్గా రూ.8.64 కోట్లు పంపామన్నారు. దీంతో షాక్ తిన్న సదరు కంపెనీ అధికారులు.. రీ చెక్ చేసుకోగా.. ఒక ఎకౌంట్ కు బదులు వేరే ఎకౌంట్ కు నగదు ట్రాన్ స్వర్ జరిగినట్టు గుర్తించారు.

వోల్టాల్‌‌ ఎంప్లెక్స్‌‌ ప్రైవేట్‌‌ కంపెనీ వాళ్లు తమకు రావలసిన 8.64 కోట్ల రూపాయలను ఆంద్రా బ్యాంక్ లో వేయమని డైమండ్‌‌ సిమెంట్‌‌  వాళ్లకు మేయిల్ చేశారు. అయితే ఇక్కడే హ్యాకర్ ఎంటర్ అయి.. మరో మెయిల్ ఐడీని డైమండ్‌‌ సిమెంట్‌‌ వాళ్లకు పంపాడు. అందులో ఆంధ్రా బ్యాంక్ బదులుగా.. అమెరికన్ బ్యాంకుకు పంపమన్నట్లు మెయిల్ చేశాడు. దీంతో డైమండ్‌‌ సిమెంట్‌‌  వాళ్లు అమెరికా బ్యాంకుకే 8.64కోట్ల రూపాయలను పంపించారు. ఎంతకీ డైమండ్‌‌ సిమెంట్‌‌  వాళ్ల దగ్గర నుండి మనీ రాకపోయే సరికి సదరు కంపెనీ వాళ్లను ఆరీతీసింది వోల్టాల్‌‌ ఎంప్లెక్స్‌‌ కంపెనీ. దీంతో మెయిల్ హ్యాక్ అయినట్లు గుర్తించింది డైమండ్ కంపెనీ. హ్యాకర్ ఎకౌంట్ కు నగదును ట్రాన్ స్వర్ చేయించుకున్నట్లు గుర్తించి వోల్టాల్‌‌ ఎంప్లెక్స్‌‌  కంపెనీ వాళ్లకు సమాచారం అందించింది. దీంతో సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయాన్ని చెప్పారు సంస్థ ఫైనాన్షి యల్‌‌ కంట్రోలర్‌‌ పద్మనా భరావు. దీంతో..  సైబర్‌‌ క్రైమ్‌‌ పీఎస్‌‌లో కేసు నమోదైంది.

Latest Updates