మియాపూర్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

హైదరాబాద్ మియాపూర్ లో 26ఏళ్ళ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని స్రవంతి ఆత్మహత్యకు పాల్పడింది. గోపాల్ నగర్ కు చెందిన స్రవంతి,రవి కిరణ్ భార్యాభర్తలు. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. స్రవంతి ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. స్రవంతి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాల కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Latest Updates