మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు
వికారాబాద్, వెలుగు: వికారాబాద్ పట్టణానికి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి చెరువులో పడి గల్లంతుకాగా.. ఆదివారం డెడ్ బాడీ లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చక్రిపురం కాప్రాకు చెందిన నరసింహ మహంతి కొడుకు విక్రమ్ మహంతి (24) మూడు సంవత్సరాల నుంచి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు. విక్రమ్ కు అప్పులు అయ్యాయి. దీంతో మనో వేదనతో ఈ నెల 11న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా స్కూటీ తీసుకుని బయటకు వెళ్లిపోయాడు. 12వ తేదీ వికారాబాద్ నుంచి హైదరాబాద్కు వెళ్లే దారిలో శివారెడ్డి పేట చెరువు వద్ద స్కూటీతో సహా చెరువులో ప్రమాదవశాత్తు పడిపోయాడు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు కాగా.. ఆదివారం విక్రమ్ డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సీఐ భీమ్ కుమార్ తెలిపారు.
కొడంగల్: వికారాబాద్ జిల్లా కొత్తురు చెరువులో పడి ఓ వ్యక్తి చనిపోయాడు. బొంరాస్ పేట ఎస్ఐ రావుఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తూరు గ్రామానికి చెందిన నర్సింలు(35) మద్యానికి బానిసయ్యాడు. తాగిన మైకంలో చెరువులో పడి ఈత రాక మృతి చెంది ఉంటాడన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం కొడంగల్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

