ఓవర్ స్పీడ్ : స్తంభానికి ఢీకొని సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి

హైదరాబాద్: బైక్ యాక్స్ డెంట్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి మ‌ర‌ణించిన సంఘ‌ట‌న మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున విద్యానగర్ లో జ‌రిగింది. విద్యానగర్ నుండి నల్లకుంట వెళ్లే దారిలో ఆంధ్ర మహిళా సభ ఆసుపత్రి రోడ్డులో బైక్ పై అధిక వేగంతో స్తంభానికి ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా హాస్పిట‌ల్ కి తరలించారు. మృతుడిని ఎండ్రిక్ హఠన్ (23) సాప్ట్ వేర్ ఉద్యోగిగా గుర్తించిన పోలీసులు.. కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం అందించారు. స్పీడ్ డ్రైవింగే ప్ర‌మాదానికి కార‌ణమ‌ని భావిస్తున్నారు పోలీసులు.

Latest Updates