లవ్ మ్యారెజ్ చేసుకున్న 20 రోజులకే మృతి

పెళ్లై కాళ్ల పారాణి కూడా ఆరక ముందే ఓ నవ వధువు బలైంది. ఎన్నో ఆశలతో ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకొని కొత్త జీవితం ప్రారంభించిన ఆ యువతి 20 రోజుల్లోనే మరణించింది. కన్నవాళ్లను కాదని పెళ్లి చేసుకున్నందుకు ఆ యువతిని కాలం కాటేసింది.

సనత్ నగర్ పీఎస్ పరిధిలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సనత్ నగర్‌కు చెందిన పూర్ణిమ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తుంది. ఆమె 20 రోజుల క్రితం తల్లిదండ్రులను ఎదిరించి దాసరి కార్తిక్ అనే యువకుడిని ప్రేమ పెళ్లి చేసుకుంది. ఏం జరిగిందో ఏమో కానీ.. భర్తతో ఉంటున్న పూర్ణిమ ఈ రోజు అనుమానాస్పదంగా మృతి చెందింది. పూర్ణిమ ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులకు కార్తిక్ తెలియజేశాడు. పూర్ణిమ తల్లిదండ్రులు మాత్రం కార్తిక్ మీదనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కార్తిక్ ఆమెను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్తున్నాడని పూర్ణిమ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం జరగాలంటూ పూర్ణిమ కుటుంబసభ్యులు సనత్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు.

More News

బీటెక్ విద్యార్థిని మిస్సింగ్ కేసులో మరో మలుపు
తల్లీ, బిడ్డలను పెట్రోల్ పోసి కాల్చేశారు

Latest Updates