సాఫ్ట్ వేర్ శార‌ద కూరగాయల బండిని దోచుకెళ్లారు

సాఫ్ట్ వేర్ శార‌ద‌ అమ్ముకునే కూరగాయల బండిని వదలేదు దొంగ‌లు. ఆమె అమ్ముకుంటున్న  కూరగాయలను దోచుకెళ్లారు. కరోనా కష్టాల్లో భాగంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని కోల్పోయినా ‘టెకీ శారద’ కూరగాయల అమ్ముకునే శారదగా మారిపోయిది. ఉద్యోగం పోయినా మనోస్థైర్యం మాత్రం కోల్పోని ఆమె తన కుటుంబ జీవనాధారం కోసం హైదరాబాద్, శ్రీనగర్ కాలనీలో ఫుట్‌ పాత్‌పై కూరగాయలు అమ్ముకుంటూ జీవిస్తోంది. ఈ విషయం కాస్తా మీడియాలో సంచలనం సృష్టించింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన శారద కూరగాయలు అమ్ముతూ డిగ్నిటీ ఆఫ్ లేబర్‌కు ప్రతీకగా నిలిచిందని ప్రశంసలు వెల్లువెత్తాయి. ఆమె గురించి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నటుడు సోనూసూద్ స్పందించి ఉద్యోగం ఆఫర్ చేశాడు. సోనూ ఆఫర్ తో శారద కష్టాలు గట్టెక్కాయి. అయితే ఆ ఆనందంలో ఉండ‌గానే శారద కూరగాయల షాపులో చోరీ జరిగింది. మంగళవారం రాత్రి కూరగాయలు అమ్మిన తర్వాత మిగతా వాటిని బండిపైనే ఉంచి కవర్‌తో కప్పి రోజూలానే ఇంటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత రోజు దుకాణానికి రాగా బండిపై ఉండాల్సిన కూరగాయలు మాయమయ్యాయి. మొత్తంగా రూ. 5 వేల విలువైన కూరగాయలు మాయమైనట్టు శారద ఆవేదన వ్యక్తం చేసింది. తన తండ్రి కూరగాయలు అమ్ముతున్నప్పటి నుంచి అక్కడే వదిలేసే వాళ్లమనీ.. ఇలా ఎప్పుడు దొంగతనం జరగలేదని శారద తెలిపింది.

Latest Updates