కామెడీ, థ్రిల్లర్ తో వస్తున్న సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌

జబర్దస్త్‌ కమెడియన్‌ సుడిగాలి సుధీర్‌ నటించిన ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. సుధీర్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా కనిపించారు. అందగత్తెలందరూ నాకోసం కొట్టుకుంటున్నారమ్మా.. నాకోసం చచ్చిపోతానంటున్నారమ్మా అని సుధీర్‌ చెప్పిన డైలాగ్‌కు అది కల నాన్నా అని ఇంద్రజ చెప్పిన సమాధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఒక వైపు లవ్ ట్రాక్, మరో వైపు థ్రిల్లర్ జోనర్ తో ఆకట్టుకుంటుంది. ఈ ట్రైలర్ ను ‘ఢీ’ టీం బుధవారం విడుదల చేశారు.

సుధీర్‌, ధన్యబాలకృష్ణన్‌ జంటగా నటించిన ఈ సినిమాను శేఖర ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై శేఖర్‌ రాజు నిర్మించారు. రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల దర్శకత్వం వహించారు. ఇంద్రజ, పోసాని, సాయాజీ షిండే తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్‌ మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Latest Updates