హైదరాబాద్ లో 26,27 తేదీల్లో సోలార్ ఎగ్జిబిషన్‌‌

బీ2బీ ఎగ్జిబిషన్ నిర్వాహణ సంస్థ యూబీఎమ్ ఇండియా రెనివెక్స్ 2019 పేరిట ఎగ్జిబిషన్‌‌ను నిర్వహిం చనుం ది. ఏప్రిల్ 26,27 తేదీల్లో తెలంగాణ స్టేట్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్‌‌మెంట్ కార్పోరేషన్ (టీఎస్‌ ఆర్‌‌‌‌ఈడీసీవో) సహాయంతో ఈ ఎగ్జిబిషన్‌‌ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. దీన్లో పలు కంపెనీలకు చెందిన 100కు పైగా ఎగ్జిబిటర్లతో పాటు పరిశ్రమ నిపుణులు పాల్గొననున్నారు. దేశంలో ఉత్పత్తయ్యే రెన్యువబుల్ ఎనర్జీ(పునరుత్పాదక శక్తి)లో సగం దక్షిణ భారతదేశం నుండే ఉత్పత్తి అవుతోందని యూబీఎమ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ యోగేష్ ముద్రాస్ తెలిపారు.

తెలంగాణలో 20.41 గిగావాట్ల సోలార్ విద్యుత్, 4.2 గిగా వాట్ల విండ్ పవర్ ఉత్పత్తి చేయగల శక్తిసామర్థ్యాలున్నాయని అన్నారు . ఏడాదిలో 300 రోజులు ఎండగానే ఉండడం తెలంగాణలో సోలార్‌‌‌‌ ఎనర్జీకి కలిసి వచ్చే అంశమని టీఎస్ఆర్ఈడీసీవో ఎండీ జానయ్య అన్నారు . సోలార్, రూఫ్‌ టాప్ ఎనర్జీల్లో తెలంగాణ రాష్ట్రం మెరుగ్గా ఉందని చెప్పారు . 2014లో రూఫ్‌ టాప్ విద్యుత్ ఉత్పత్తి 2 మెగావాట్లు కాగా ఇప్పటికి 60 మెగావాట్ల విద్యుత్‌‌ ఉత్పత్తి అవుతోందని తెలిపారు.

రెన్యువబుల్ ఎనర్జీలో ఇండియా మూడో స్థానంలో ఉండగా, తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 3500 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తవుతుండగా మరో ఏడాదిలోగా వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అందుబాటులోకి వస్తుందని తెలిపారు.2024 నాటి కి 5000 మెగావాట్ల సోలార్ విద్యుత్ తెలంగాణలో అందుబాటులోకి వస్తుందని జానయ్య వెల్లడిం చారు. కుసుమ్ పథకం ద్వారా రైతులకు సోలార్ విద్యుత్‌‌ను పరిచయం చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా పంప్‌‌సెట్లను సోలార్‌‌‌‌తో అనుసంధానం చేయనుంది.

తెలంగాణలో 25 లక్షల పంప్‌ ‌సెట్లున్నాయని వీటిలో మూడోవంతు సోలార్‌‌‌‌కు అనుసంధానం చేయగలిగితే రైతులకు మరింత ప్రయోజనకరంగా ఉంటుం దని ఆలోచిస్తోంది. వంద రోజుల విద్యుత్‌‌ ఉత్పత్తిని వ్యవసాయానికి వాడుకున్నా మిగిలిన 200 రోజుల విద్యుత్ ఉత్పత్తిని డిస్కమ్‌ లకు అమ్ముకోవచ్చని, దీంతో రైతులు మరింత ఆర్జించే అవకాశం ఉంటుందని జానయ్య అన్నారు .

Latest Updates