సోలో బ్రతుకే సో బెటర్ అంటున్న బర్త్ డే బాయ్

చిత్రలహరి సినిమాతో మంచి హిట్ అందుకున్న సుప్రీం హీరో, మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం ‘ప్రతీరోజూ పండగే’ చిత్రంలో నటిస్తున్నాడు. తాజాగా ఆయన మరో సినిమా చేస్తున్నట్టు తెలుస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర(SVCC) బ్యానర్ లో ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. అక్టోబర్ 15 సాయి ధరమ్ తేజ్ పుట్టిన రోజు  సందర్భంగా ఆ చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ని రిలీజ్ చేసింది. పోస్టర్ లో తేజ్ స్టైలిష్ లుక్ తో పాటు ‘హ్యపీ బర్త్ డే సాయి తేజ్’ అని టీమ్ శుభాకాంక్షలు తెలిపింది. ఈ చిత్రానికి సంబంధించిన విషయాలు ఇంకా తెలియరాలేదు.

Solo Bratuke So Better movie team releases poster on Sai tej Birthday

Latest Updates