డేటా చోరీ చేస్తున్న యాప్స్‌‌.. జర భద్రం

న్యూఢిల్లీ: మనం పర్మిషన్‌‌ ఇవ్వకపోయినా, మన రహస్య వివరాలను స్మార్ట్‌‌ఫోన్‌‌ యాప్స్‌‌ తెలుసుకోగలవనే విషయం మీకు తెలుసా ? వేలాది యాప్స్‌‌ మన అనుమతి లేకుండానే రహస్య వివరాలను తెలుసుకుంటున్నాయని ఇంటర్నేషనల్‌‌ కంప్యూటర్‌‌ సైన్స్‌‌ ఇన్‌‌స్టిట్యూట్‌‌ (ఐసీఎస్‌‌ఐ) నిర్వహించిన స్టడీలో తేలింది. యాప్స్‌‌లో పెట్టే కామన్‌‌ ఎస్‌‌డీకే (సాఫ్ట్‌‌వేర్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ కిట్‌‌) లైబ్రరీల ద్వారా మనం అనుమతి ఇచ్చిన మరో యాప్‌‌ నుంచి మన రహస్య వివరాలను చాలా యాప్స్‌‌ దోచేస్తున్నాయట.

ఇలాంటి థర్డ్‌‌పార్టీ లైబ్రరీలను సాధారణంగా ఎనలిటిక్స్‌‌ సర్వీసెస్‌‌, సోషల్‌‌–నెట్‌‌వర్క్‌‌ ఇంటిగ్రేషన్‌‌, ఎడ్వర్టైజింగ్‌‌ల కోసం వాడతారు.   ఈమెయిల్‌‌, ఫోన్‌‌ నెంబర్‌‌ లేదా సోషల్‌‌ మీడియా అకౌంట్‌‌ ద్వారా యూజర్‌‌ సైన్‌‌ అప్‌‌ చేసినప్పటి నుంచి యూజర్‌‌ ఇన్ఫర్మేషన్‌‌ను ఆండ్రాయిడ్‌‌, ఐఓఎస్‌‌లు కలెక్ట్‌‌ చేస్తున్నాయి. యూజర్‌‌ ఎక్స్‌‌పీరియన్స్‌‌ను మెరుగుపరచడం కోసం యాప్‌‌ డెవలపర్లు ఈ డేటాను వాడుకుంటారు.

అంతేకాదు, ఎడ్వర్టైజర్లతో డబ్బు కోసం పంచుకుంటారు.  ఐతే, కొంత మంది యూజర్ల సమ్మతితో చట్టబద్దంగా డేటా కలెక్ట్‌‌ చేస్తుంటే, మరి కొంత మంది మాత్రం అక్రమాలకు పాల్పడుతున్నారు. యాప్‌‌సెన్సస్‌‌, ఎక్సోడస్‌‌ ప్రైవసీ వంటి సర్వీసెస్‌‌ ద్వారా ఇలా డేటా చోరీ చేస్తున్న యాప్స్‌‌ను యూజర్లు గుర్తించొచ్చని కాస్పర్‌‌స్కై ల్యాబ్స్‌‌ చెబుతోంది.

Latest Updates