మా సంస్థను మేమే కొంటాం

Some employees want to bid for Jet Airways, writes to SBI to consider

ఎస్‌బీఐకి జెట్ ఎయిర్​వేస్​ ఉద్యోగుల లెటర్

​న్యూఢిల్లీ: అప్పుల్లో చిక్కు కొని మూతబడ్డ తమ సంస్థలో వాటాను తామే కొనుక్కుంటామని జెట్‌ఎయిర్‌ వేస్‌ ఉద్యోగులు ఎస్‌ బీఐకి లేఖ రాశారు. జెట్‌ కు అత్యధికంగా అప్పులు ఇచ్చి న ఎస్‌ బీఐఈ కంపెనీని తన చేతుల్లోకి తీసుకున్న సంగతి తెలిసిందే. జెట్‌ కొనుగోలుకు బిడ్‌ వేయడానికి ఉద్యోగులకు, ఇన్వెస్టర్లకు అవకాశం ఇవ్వాలని వీరు లేఖలో పేర్కొన్నా రు. ఎంప్లాయీ స్టాక్‌‌ ఆప్షన్ ప్రోగ్రామ్‌ ద్వారా రూ.నాలుగు వేల కోట్లు సమకూర్చుతామని, ఇన్వెస్టర్ల నుంచి రూ.మూడు వేల కోట్లు వస్తాయని పేర్కొన్నా రు.ఈ విషయమై చర్చిం చడానికి తమను ఆహ్వానించాలని ఎస్‌ బీఐని కోరారు. సీనియర్‌ జెట్‌ ఉద్యోగులు సీనియర్‌  వైస్‌ ప్రెసిడెంట్‌ , అకౌంటబుల్‌ మేనేజర్‌ కెప్టెన్‌‌ పీపీ సింగ్‌ , హెచ్‌ ఆర్‌మేనేజర్‌ బీబీ సింగ్‌ ఈ ఉత్తరంపై సంతకాలు చేశారు. ‘‘మా దగ్గర ఇన్వెస్టర్లు ఉన్నారు. వారి పేర్లు ఇప్పుడు చెప్పలేం. మా సంస్థను లాభాల్లోకి ఎలా తేవాలో తెలుసు. జెట్‌ విలువ ఏంటో మాకు తెలుసు. మా ప్లాన్‌‌ను ఎస్‌ బీఐతో పాటు ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుం దని ఆశిస్తున్నాం’’ అని  సొసైటీ ఫర్‌ వెల్ఫేర్‌ ఆఫ్ ఇండియన్‌‌ పైలెట్స్‌ ప్రధాన కార్యదర్శి అశ్వినీత్ యాగి పేర్కొన్నా రు. జెట్‌ కు చెందిన 440 స్లాట్లను ప్రభుత్వం వేరే కంపెనీలకు ఇస్తున్న నేపథ్యంలో జెట్‌ ఉద్యోగులు ఈ లేఖ రాశారు. జెట్‌ లో వాటాల అమ్మకానికి ఎస్‌ బీఐ నేతృత్వం లోని కన్సార్షియం బిడ్డింగ్‌ ప్రారంభించగా ఐదారు సంస్థలు బిడ్లు వేశాయి. వచ్చే నెలలోపు బిడ్ల సంగతి తేలే అవకాశం ఉంది.

ప్రస్తుతం జెట్‌ కు రూ.8,500కోట్ల అప్పులు ఉన్నా యి. వాటిని చెల్లించకపోవడంతో సంస్థను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ప్రకటించారు. లెండర్లు తక్షణ సాయంగారూ.1,500 కోట్లు ఇస్తామన్నా , ఆ నిధులు రాకపోవడంతో మూసివేత అనివార్యమైంది. జెట్‌ కు అత్యధికంగా అప్పులు ఇచ్చి న ఎస్‌ బీఐ.. లెండర్ల కన్సార్షియానికి నాయకత్వం వహిస్తోంది. జెట్‌ఎయిర్‌ వేస్‌ లో వాటా కొనుగోలుకు ఎతిహాద్‌‌ ఎయిర్‌ వేస్‌ , టీపీజీక్ యాపిటల్‌ , ఇండిగో పార్ట్‌‌నర్స్‌ , నేషనల్‌ ఇన్వెస్ట్‌‌మెంట్‌ అండ్‌ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌( NIIF) బిడ్లు వేసినట్టు తెలిసింది. బిడ్డర్ల పూర్తి వివరాలు వచ్చే 10 నాటికి తెలుస్తాయి.బిడ్డింగ్‌ ప్రక్రియను కొనసాగిస్తూనే ప్రస్తుతం అందుబాటులో ఉన్న 16 విమానాల ద్వారా నిధులు సమీకరించడానికి లెండర్లు ప్రయత్నిస్తున్నారు.జెట్‌ సంక్షోభంలో చిక్కు కున్నప్పటి నుం చే పరిష్కారం కోసం లెండర్లు కృషి చేసినా, జెట్‌ యాజమాన్యం , ప్రమోటర్‌ ఆలస్యం గా నిర్ణయాలు తీసుకోవడం పరిస్థితి చేయిదాటి పోయిందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

Latest Updates