కరోనాకు పేద, ధనిక తేడా లేదు.. మరి ట్రీట్మెంట్ లో ఎందుకీ తేడా?

చైనాలో పుట్టి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ పేదోడు – ధనవంతుడు అన్న భేదం లేకుండా అందరికి వ్యాపిస్తుంది. కరోనా విషయంలో ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండి..సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకోవాలని ప్రభుత్వాలు ప్రజల్ని కోరుతున్నాయి. అవసరమైతే వైద్యం కోసం ఎన్నివేల కోట్లైనా ఖర్చు చేస్తామని ప్రచారం చేస్తున్నాయి. కానీ రాష్ట్రం నుంచి దేశం వరకు వైద్యం అందించే విషయంలో పేద ‌‌– ధనిక తారతమ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రైవేట్ ఆస్పత్రులు సైతం కరోనా ట్రీట్మెంట్ విషయంలో దారుణంగా ప్రవర్తిస్తున్నాయి. సామాన్యులు ట్రీట్మెంట్ అందించేందుకు ఒప్పుకోవడం లేదు. కానీ ధనికులు ట్రీట్మెకోసం వస్తే దగ్గరుండీ మరి వీఐపీ ట్రీట్మెంట్ అందిస్తున్నారు.

ముఖ్యంగా తెలంగాణలో కరోనా వైరస్ పై ట్రీట్మెంట్ అందించే విషయంలో ప్రభుత్వం పేదలకు ఒకలా, ధనికులకు ఒకలా ట్రీట్మెంట్ అందిస్తుంది. వాటిలో

 ⇒ పేదవాళ్లు

హైదరాబాద్ అత్తాపూర్ కు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి తన భార్య రోహిత కు అనారోగ్యం తలెత్తడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ కరోనా టెస్ట్ లు చేయగా..ఆ టెస్ట్ ల్లో బాధితురాలికి కరోనా సోకినట్లు నిర్ధారించారు. దీంతో ట్రీట్మెంట్ చేసేందుకు నిరాకరించారు. దాంతో ఆమెను తీసుకొని శ్రీకాంత్ 10ఆస్పత్రుల చుట్టూ తిరిగాడు. చివరకు పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది. ఇలా ఒక్క ఇన్సిడెంటే కాదు ఇలాంటి ఘటనలు తెలంగాణ రాష్ట్రంలో చాలా జరిగాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

ధనికులు
కరోనా సోకిన ఎమ్మెల్యేలకు సికింద్రాబాద్ లోని యశోద హస్పిటల్ లో ట్రీట్మెంట్ ఇప్పించారు. పేదల్ని పట్టించుకోని ప్రభుత్వం, ఎమ్మెల్యేలకు ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ అందించడం వివాదాస్పదంగా మారింది.

⇒ పేదవాళ్లు
బెంగళూరులో కరోనా సోకిన బాధితురాలికి ట్రీట్మెంట్ ఇచ్చేందుకు డాక్టర్లు నిరాకరించారు. 18ఆస్పత్రుల చుట్టూ తిరిగిన తరువాత బాధితురాలు మృతి చెందారు.

ధనికులు
అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ కుటుంబసభ్యులకు నార్మల్ కరోనా లక్షణాలు ఉండడంతో వీఐపీ ట్రీట్మెంట్ అందించారు.

⇒పేదవాళ్లు
కరోనా నుంచి సురక్షితంగా ఉండేందుకు వినియోగించే శానిటైజర్ కు 18శాతం జీహెచ్ పేచేస్తున్నాం

ధనికులు
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రూ.4లక్షల బంగారు మాస్క్ ను ధరిస్తున్నాం

 ⇒ పేదవాళ్లు
66ఏళ్ల మహిళకు కరోనా సోకింది. ట్రీట్మెంట్ కోసం ఓ ఆస్పత్రికి వెళ్లగా ఆమెను 30గంటల పాటు ఆస్పత్రి సెల్లార్ లో ఉంచారు. కుటుంబసభ్యుల ఆందోళనతో చివరికి ట్రీట్మెంట్ చేసేందుకు డాక్టర్లు అంగీకరించారు.

ధనికులు
నటి మోహనా కుమారి సింగ్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులకు కరోనా సోకడంతో డాక్టర్లు పర్యవేక్షణలో వారికి ట్రీట్మెంట్ అందించారు.

⇒ పేదవాళ్లు
హైదరాబాద్ లో ట్రీట్మెంట్ ఇచ్చేందుకు డాక్టర్లు నిరాకరించడంతో బాధితుడు రోడ్డుపైనే మరణించారు.

ధనికులు
రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ సీఈఓ సర్కార్ కి ఒంట్లో నలతగా ఉందంటూ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ఆస్పత్రిలో జాయిన్ అయిన కొద్దిరోజులకే కరోనా రావడంతో ట్రీట్మెంట్ అందించారు.

⇒ పేదవాళ్లు
ఉత్తర్ ప్రదేశ్ లో వన్ ఇయర్ బాబుకి ట్రీట్మెంట్ అందించేందుకు డాక్టర్లు ఒప్పుకోలేదు.

ధనికులు
ఢిల్లీ మంత్రి సత్యేంద్రజైన్ కు కరోనా సోకడంతో రిమ్స్ కు తరలించారు. కరోనా తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి అక్కడ ట్రీట్మెంట్ అందించారు.

⇒ పేదవాళ్లు
లాక్ డౌన్ కారణంగా వలస కార్మికులు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు వెయ్యి కిలోమీటర్లు నడిచారు.

ధనికులు
ప్రముఖ వ్యాపార వేత్త లాక్ డౌన్ కారణంగా ఢిల్లీలో ఉన్న తన కుటుంబసభ్యుల్ని సొంత రాష్ట్రమైన భోపాల్ కు తీసుకొచ్చేందుకు అత్యంత ఖరీదైన ఏ320ఎయిర్ క్రాఫ్ట్ ను బుక్ చేసుకున్నాడు.

⇒ పేదవాళ్లు
వలస కూలీలు తమ సొంతరాష్ట్రాలకు వెళ్లేందుకు క్యాన్సిల్ అయిన ట్రైన్ కోసం నెలల తరబడి ఎదురు చూశారు.

ధనికులు
ఓ ధనవంతుడు బెంగళూరులో ఉన్న తన కుక్కను ముంబైకి తెచ్చేందుకు సొంతంగా ప్రైవేట్ జెట్ ను బుక్ చేసుకున్నాడు.

Latest Updates