ఈ చట్టాలు ఉన్నాయని తెలుసా

ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, పటిష్టమైన చట్టాలు, షీ టీములు, ప్రత్యేకమైన యాప్ లు ఇలా ఎన్ని వచ్చినా ఇప్పటికీ కనిపించని వివక్ష నడుస్తూనే ఉంది. రోజుకో దాడి జరుగుతూనే ఉంది.  విమెన్ డిస్క్రిమినేషన్ అనేది ఒక్క మన దేశానికే పరిమితం కాదు. కానీ జరుగుతున్న సంఘటనలని చూస్తుంటే మనం ఖచ్చితంగా చర్చించుకోవాల్సిన విషయం ఇది. మనదేశంలో 25 ఏళ్లు దాటిన ఆడవారిలో ఉద్యోగాలు చేసేవారి సంఖ్య 33 శాతం మాత్రమేనని వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా  వైట్ కాలర్ జాబ్స్‌‌లోఆడవాళ్లు తక్కువగా ఉన్న దేశాల్లో మన దేశం కూడా ఒకటి. వీటన్నిటికీ కారణం? డిస్క్రిమినేషన్, సెక్సువల్ హెరాస్‌‌మెంట్స్ అన్న చేదు నిజాన్ని నమ్మక తప్పదు…

రక్షణ అన్నది కేవలం ఫిజికల్ ఎటాక్ నుంచి మాత్రమే కాదు. వెకిలి చూపులనుంచి, బాధపెట్టే మాటలనుంచి, రోజువారీ పనుల్లో  చూపించే డిస్క్రిమినేషన్ నుంచి. చుట్టూ మనుషులు ఉన్నప్పుడు కూడా భయపడుతూ ఉండటం కన్నా విషాదం ఏముంటుంది? ఎవరూ లేని చోట కన్నా మగవాళ్ళు ఎక్కువమంది ఉన్నచోటే ఎక్కువమంది ఆడవాళ్ళు భయపడటాన్ని చూస్తున్నాం. ఇళ్ళూ, స్కూల్, ఆఫీస్, బస్, ఆఖరికి వర్చువల్ వరల్డ్ అయిన సోషల్ మీడియాలో అయినా భయం భయంగా ఉంటున్న ఆడవాళ్ల సంఖ్య తక్కువేమీ కాదు.  వరుసగా జరుగుతున్న ఘటనలతో ఎవ్వరినీ నమ్మని ఒక ఇన్‌‌సెక్యూర్డ్ ఫీలింగ్ లోకి వెళ్తోన్న వర్కింగ్ వుమెన్, సింగిల్ మదర్స్ సంఖ్య పెరుగుతోందంటున్నారు సైకాలజిస్టులు.

ఇన్ని చట్టాలు ఉన్నాయి కదా అయినా ఎందుకిన్ని అవాంచనీయమైన సంఘటనలు జరుగుతున్నాయి?  అంటే…. అసలు ఆ చట్టాల మీద అవేర్‌‌‌‌నెస్ లేకపోవటమే కారణం అన్నది పోలీసుల ఒపీనియన్. నేరం గురించీ, దానికి పడే శిక్ష గురించీ చిన్న వయసులోనే తెలిసేట్టు చేయటం క్రైం ఆలోచనలనుంచి దూరం చేస్తుందన్నది సైకాలజీ చెప్తున్న మాట. దీన్ని ఫాలో అయితే చిన్న తనంలోనే ఏది తప్పు, ఏది కరెక్ట్ అని అన్ని విషయాల్లో వచ్చే ఆలోచనలాగానే ఈ విషయంలోనూ కొంత దృష్టి వస్తుంది.   అసలు ఏ ఏ విషయాలలో కేసు పెట్టొచ్చు అన్న విషయాలు అటు నేరానికి పాల్పడేవాళ్ళకీ, ఇటు బాధితులకీ తెలియకపోవటం వల్ల కూడా నేరాలకి అవకాశం ఇస్తుందన్నది వాళ్ల మాట. ఎగ్జాంపుల్… సెక్షన్‌‌ 354 ప్రకారం ఒక మహిళ శరీరాన్ని లైంగిక ఉద్దేశంతో చూసినా, తాకినా, ఆఖరికి కళ్లతోసైగ చేసినా అది నేరమే అవుతుంది. కానీ ఇలాంటి విషయం తెలియక, అలాంటి వాళ్లని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక ఎక్కువ ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటు న్నారన్నది కూడా ఒక వాదన…. అందుకే ఈ రకమైన చట్టాలని అందరూ తెలుసుకుంటే మంచిదే. అసలు తాను చేస్తున్నది నేరం అని తెలిస్తే అయినా ఈవ్ టీజింగ్ చేసే టీనేజర్స్  కొంత ఆలోచించవచ్చు కదా….

అందుకే ఒకసారి మహిళల రక్షణ కోసం ఎలాంటి చట్టాలున్నాయో చూద్దాం.

చట్టాలూ – శిక్షలూ
సెక్షన్ 100 _ ఆత్మరక్షణకోసం మహిళ చేసిన ఎదురు దాడిలో ఆ వ్యక్తి మరణించినా అది నేరం కిందకి రాదు. సెల్ఫ్ ప్రొటక్షన్ కోసం చేసిన ప్రయత్నమే తప్ప అది హత్యగా చూడరు.
సెక్షన్ 228 A_ – సెక్సువల్ ఎటాక్కి గురైన మహిళ పర్మిషన్ లేకుండా మీడియాలో కూడా ఆమె పేరు, ఫొటో రాకూడదు, వివరాలు చెప్పకూడదు.
సెక్షన్ 354 _- ఒక మహిళ శరీరాన్ని లైంగిక ఉద్దేశంతో చూసినా, తాకినా, ఆఖరికి కళ్లతోసైగ చేసినా అది నేరమే అవుతుంది.
సెక్షన్ 376_ – హాస్పిటల్ లో మెడికల్ సిబ్బంది, డాక్టర్స్ లైంగికంగా వేధిస్తే ఈ సెక్షన్ ప్రకారం అది నేరమే.
సెక్షన్ 509_ – వల్గర్ కామెంట్స్, సైగలు, అసభ్యకరమైన వస్తువులను చూపించటం లాంటివి కూడా వేదింపులకిందకే వస్తాయి.
సెక్షన్ 294 -_ పబ్లిక్ ప్లేస్ లో ఉన్నప్పుడు, బస్టాపుల్లో, జర్నీల్లో అసభ్యకరమైన పాటలు, శబ్దాలు చేసి ఇబ్బంది పెడితే ఈ సెక్షన్ ప్రకారం 3 నెలలు శిక్ష పడుతుంది.
2013 వేధింపుల చట్టం- _వర్కింగ్ వుమెన్ అయితే ఆఫీస్ లో కొలిగ్స్, బాస్ ఆఫీసు పనులను అలుసుగా తీసుకొని సెక్సువల్ కాంటాక్టు కోసం ఇబ్బంది పెడితే ..
సెక్షన్ 376-B_ – మోలెస్టేషన్ ఘటనల్లో ఎక్కువమంది ఉంటే ఆ గ్రూప్ లో ఉన్న ప్రతి వ్యక్తీ నేరస్తుడే, అందరికీ శిక్ష పడుతుంది.
ఐపీసీ 375_- అత్యాచారం అని ప్రూవ్ అయితే ఏడేళ్లు జైలు శిక్ష నుంచి జీవిత ఖైదు.
అవమానపరిచి, దాడి చేస్తే ఐపీసీ 354 ప్రకారం 5 నుంచి 7 వరకు జైలు శిక్ష పడుతుంది.
పెళ్లయినా కానట్లు మోసగించిన పురుషులకు ఐపీసీ 496 ప్రకారం ఏడేళ్లు జైలు, జరిమానా .
ఐపీసీ 302- ఉమెన్ మర్డర్ జరిగితే జీవిత ఖైదు.
వరకట్నం కోసం భార్యను హత్య చేస్తే సెక్షన్ 302బి ప్రకారం ఏడేళ్ళు జైలు, జీవితఖైదు
ఆత్మహత్యకు ప్రేరేపించినా సెక్షన్ 306 పదేళ్లు జైలు, జరిమానా, మహిళలను బంధిస్తే ఏడేళ్లు జైలు, జరిమానా
అత్యాచార ఉద్దేశంతో దౌర్జన్యం చేస్తే సెక్షన్ 356 కింద జైలు, జరిమానా
కిడ్నాప్ చేస్తే సెక్షన్ 363 కింద జైలు
భార్య ఉండగా రెండో పెళ్లి చేసుకుంటే సెక్షన్ 494 కింద ఏడేళ్ళు జైలు, జరిమానా
మొదటి పెళ్ళి దాచి రెండో పెళ్ళి చేసుకుంటే సెక్షన్ 495 కింద
పదేళ్ళు జైలు…

Latest Updates