సైంటిస్టులను నమ్మని ముస్లింలు పాక్‌‌కు వెళ్లిపోవాలి

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్‌‌పై సందేహాలు వ్యక్తం చేస్తున్న ప్రతిపక్షాలను ఉద్దేశించి బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశ శాస్త్రవేత్తలపై నమ్మకం లేని ముస్లింలు పాకిస్థాన్‌కు వెళ్లిపోవొచ్చునని సంగీత్ సోమ్ కామెంట్ చేశారు. కొందరు ముస్లింలు మన సైంటిస్టులను నమ్మడం లేదని చెప్పారు. ‘దురదృష్టవశాత్తూ దేశ శాస్త్రవేత్తలు, పోలీసులను కొందరు ముస్లింలు నమ్మడం లేదు. ప్రధాని మోడీ పైనా వారికి నమ్మకం లేదు. పాకిస్థాన్ మీదే వారికి నమ్మకం ఎక్కువ. కాబట్టి వాళ్లు పాక్‌‌కు వెళ్లిపోవాలి. కానీ శాస్త్రేవేత్తలను మాత్రం అనుమానించొద్దు’ అని సంగీత్ సోమ్ పేర్కొన్నారు.

Latest Updates