ప్రగతి రూటులో కాశ్మీర్ ప‌రుగు

జమ్మూకాశ్మీర్ లోచేపట్టిన కొన్ని చర్యలు
బిజినెస్నుసులభతరం చేసేలా కార్మిక చట్టాల నిబంధనల్లో రిఫామ్స్
సంఘటిత, అసంఘటి తరంగాల్లో కార్మికులకు సోషల్ సెక్యూరిటీ హక్కులు అందేలా చూడటం
నిరాశలో ఉన్నకార్మికులు, ముఖ్యంగా వలస కార్మికుల అవసరాలు తీర్చడం
చట్టబద్ధమైన హక్కుల గురించి కార్మికులకు తెలిసేలా ప్రచారం చేయడం

సరికొత్త అభివృద్ధిదిశగా నడుస్తున్న జమ్మూకాశ్మీర్ లో ఉపాధితో పాటు సోషల్ సెక్యూరిటీ కల్పించడం మంచి ఫలితాలను ఇస్తోంది. ఇక్కడ అనేక పాలసీలను ఉమ్మడిగా అమలు చేయడంవల్లనే డెవలప్ మెంట్ వీలవుతోంది. కాశ్మీర్ లో కొన్ని ముఖ్యమైన ప్రోగ్రామ్స్ ‌‌‌ద్వారా ఉపాధి అవకాశాలు పెరిగి సోషల్ సెక్యూరిటీ సాధించగలిగాం.

బిజినెస్ రిఫామ్స్

ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కార్మిక చట్టాలు అమలు చేస్తూ, పనిచేసే చోట పరిస్థితులు మెరుగు పర్చడమే లేబర్, ఎంప్లాయ్ మెంట్ మినిస్ట్రీ ప్రధాన లక్ష్యం. గడిచిన ఏడాది కాలంలో కాశ్మీర్ లో ఎంప్లాయ్ మెంట్ శాఖ తన కార్యకలాపాలు విస్తరించడమే కాదు, ఆఫీసుల ఏర్పాటుకూ చర్యలు తీసుకుంది. వ్యాపారాన్ని సులభతరం చేయడానికి అనేక కార్మిక చట్టాల సవరణ జరిగింది. వాటిలో పారిశ్రామిక వివాదాల చట్టం, మోటారు రవాణా కార్మికుల చట్టం, కాంట్రాక్ట లేబర్ (నియంత్రణ, రద్దు) చట్టం, ఫ్యాక్ట‌రీల‌ చట్టం, కార్మిక సంఘాల చట్టం, కన్ స్ట్రక్షన్ లేబర్ చట్టం వంటివి ఉన్నాయి. వీటికి సవరణల ద్వారా కొన్ని పరిమితులను పెంచారు. నేరాలకు జరిమానాలు ప్రవేశపెట్టారు. రిజిస్ట్రేషన్ జరిగినట్టు పరిగణించే నిబంధనలు చేర్చారు. పరిమితుల తగ్గింపు, మహిళలు రాత్రివేళ పనిచేసేందుకు అనుమతించడం, ఉద్యోగాల నుంచి తొలగించిన‌ప్పుడు ఇచ్చే పరిహారం పెంచడంలాంటివి అమలు చేశారు. వీటి వల్ల కాశ్మీర్ లో పెట్టుబడులను ఆకర్షించవచ్చు. దాంతో మరిన్ని ఉద్యోగావకాశాలు వస్తాయి. పర్యాటకం కూడా పెరుగుతుంది.

సోషల్ సెక్యూరిటీ

కాశ్మీర్ లో ఈపీఎఫ్, ఈఎస్ఐ లాంటి సోషల్ సెక్యూరిటీ ప్రయోజనాలు మరింత బలోపేతం చేశారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ సంస్థ(ఈపీఎఫ్ వో) 2019 నవంబర్ 1న జమ్మూలో రీజనల్ ఆఫీసు ఏర్పాటు చేసింది. తొలి ఏడాదిలోనే 3,326 సంస్థలు, 1,26,675 మంది ఉద్యోగులు ఈపీఎఫ్ వో పరిధిలోకి వచ్చారు. దేశంలో మిగిలిన చోట్ల20 మందికి మించి కార్మికులుంటే పీఎఫ్ వర్తిస్తుండగా, ఇక్కడ 10 మంది దాటితేనే పీఎఫ్ వర్తించేలా చట్టాన్ని సవరించారు. ప్రధానమంత్రి గరీభ్ కల్యాణ్ యోజన కింద ఉద్యోగి, యజమాని వాటాలు ప్రభుత్వమే భరిస్తోంది. ఇప్పటివరకు 2,95,253 మంది ఈఎస్ఐ కింద నమోదు చేసుకోగా 91,974 మంది కార్మికులు, వారిపై ఆధారపడిన 67,227 మంది కుటుంబ సభ్యులు 2019–20లో ట్రీట్ మెంట్స్ పొందారు. ఒంపారా బుద్గాం లో రూ.150 కోట్లతో 100 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు ఈఎస్ఐ ఆమోదం తెలిపింది. గనుల
భద్రతా డైరెక్ట‌రేట్ జనరల్ రీజనల్ ఆఫీసును ప్రారంభించే అంశాన్నికూడా ఆ మినిస్ట్రీ పరిశీలిస్తోంది. 2019లో ప్రారంభించిన పీఎం శ్రమ యోగి మాన్ ధన్ యోజన కింద వృద్ధుల రక్షణ, అసంఘటిత రంగ కార్మికుల సోషల్ సెక్యూరిటీ లక్ష్యం కాగా, ఇందులో 93,185 మంది కార్మికులు నమోదు చేసుకున్నారు. ఇలా యూటీల్లో జమ్మూకాశ్మీర్ కు మొదటి స్థానం, రాష్ట్రాలలో కూడా కలిసి జాతీయ స్థాయి లో 11వ స్థానం లభించాయి.

కార్మికుల సంక్షేమం

కరోనా సంక్షోభంలో 1,57,516 మంది కన్ స్ట్రక్షన్ లేబర్ కు రూ.46 కోట్ల సాయం అందించారు. కార్మికులకు ఆశ్రయం కల్పించడం కోసం సాంబా, ఉధంపూర్, ఖాన్ పొరా బౌలి, బారాముల్లాలోఇండ్ల నిర్మాణం జరుగుతోంది. వలస కార్మికులకు సాయం చేసేందుకు హెల్ప్ లైన్లుఏర్పాటు చేశారు. వలస కార్మికుల రిజిస్ట్రేషన్ కోసం హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేశారు. ఆన్ లైన్ పద్ధతిలో 13 సేవలు అందిస్తూండగా, కార్మికశాఖ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ ప్రజా సేవల హామీ చట్టం, 2011 కింద 26 సేవలు అందుబాటులోకి తెచ్చారు.

ప్రజల ఆకాంక్షలునెరవేరుతాయి..

డెవలప్ మెంట్ కోసం తీసుకున్న అనేక చర్యల వల్ల కాశ్మీర్ లో కార్మికులకు గొప్ప ప్రోత్సాహం లభించింది. ప్రజలందరికీ ప్రయోజనాలు అందుతున్నాయి. దీనివల్ల ఆర్థికాభివృద్ధితో పాటు మరిన్ని పెట్టుబడులకు అవకాశం ఏర్పడి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వివిధ అంశాలను ఉమ్మడిగా అమలు చేయడం వల్లఉపాధి, సోషల్ సెక్యూరిటీ అనే లక్ష్యాలను సాధించేందుకు వీలవుతుంది. తద్వారా కాశ్మీ ర్ ప్రజల అభివృద్ధి ఆకాంక్షలను నెరవేర్చడం సాధ్యమవుతుంది. – డాక్టర్ ఎస్.కె. శశికుమార్ ఆర్థికవేత్త, వీవీ గిరి నేషనల్లేబర్ ఇన్‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌లోసీనియర్ ఫెలో

మ‌రిన్ని వార్త‌ల కోసం..

Latest Updates