పండులో పటాకులు పెట్టి.. దాన్ని ఏనుగుకు పెట్టి..

ఆకతాయిల పనికి ఏనుగు బలి

పైనాపిల్‌‌లో పటాకులు పెట్టారు

కేరళ మలప్పురం  దగ్గర్లోని  ఓ గ్రామంలో కొందరు ఆకతాయిలు అత్యంత క్రూరమైన చర్యకు పాల్పడ్డారు.  మానవత్వం మరిచిపోయి  గర్భంతో ఉన్న ఓ ఏనుగు చావుకు  కారణమయ్యా రు. ఆకలితో గ్రామంలోకి వచ్చిన ఏనుగుకు పైనాపిల్​లో పటాకులు పెట్టి తినటానికి ఇచ్చారు. ఆ గజరాజు ఫ్రూట్​ అనుకుని దాన్ని తినడంతో పటాకులు పేలి నోరు, నాలికకు  దెబ్బలు తగిలాయి. నొప్పి తట్టుకోలేక ఊరంతా పరుగులు పెట్టింది. అప్పటికీ రిలీఫ్ లేకపోవటంతో  నదిలోకి వెళ్లి గంటల కొద్దీ నీటిలో నిలబడింది. దాని ప్రాణాలు కాపాడేందుకు  ఫారెస్ట్​ అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గజరాజు నదిలో నిలబడే ప్రాణాలు విడిచింది. మే 27 న జరిగిన ఈ సంఘటనపై  ఆవేదన వ్యక్తంచేస్తూ  మెహన్ కృష్ణ అనే ఫారెస్ట్ అధికారి తన ఫేస్ బుక్ వాల్ పై గజరాజు నదిలో ఉన్న ఫోటోలతో సహా పోస్ట్ చేశారు.

For More News..

జగన్ చేతిలో కేసీఆర్ కీలుబొమ్మ

మొబైల్ కంపెనీలకు సూపర్​ ఆఫర్

ఈ నెల నుంచి కొత్త కరెంట్ బిల్లులు

Latest Updates