దేశభక్తులైన కొందరు ముస్లింలు ప్లాస్మా దానం చేస్తున్నారు

కరోనా వైరస్ నుంచి కోలుకుని ప్లాస్మాను డొనేట్ చేస్తున్న కొందరు ముస్లింలను కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ప్రశంసించారు. మరోవైపు నేరపూరిత స్వభావంతో కొందరు తబ్లిగీ జమాత్ సభ్యులు వైరస్ వ్యాప్తికి కారణమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాపం చేసిన వీరంతా కరోనా యోధులుగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. తప్పు చేసి గొప్పలు చెప్పుకోవడం అంటే ఇదేనంటూ విమర్శించారు.

దేశ భక్తులైన కొందరు ముస్లింలు ప్లాస్మా దానం చేస్తున్నారని… వారందరినీ తబ్లిగీ అనడం సరికాదన్నారు నఖ్వీ. దేశంలో ప్రతి ముస్లింను తబ్లిగీగా చూపించేందుకు కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

Latest Updates