అవన్నీ పుకార్లే : త్రిపుర సీఎం భార్య

అగర్తలా : త్రిపుర ముఖ్యమంత్రికి ఆమె భార్య విడాకులు ఇస్తుందని ఇటీవల ఆ రాష్ట్రంలో వార్తలు వచ్చాయి. అయితే దీనిపై స్పందించారు సీఎం భార్య నితిదేవ్. త్రిపుర సీఎం బిప్లవ్ దేవ్ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయనే ప్రచారానికి ఆయన సతీమణి నితి దేవ్ చెక్ పెట్టారు. కొందరు పనిగట్టుకుని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని సీరియస్ అయ్యారు. “విడాకుల సమాచారం తెలియగానే ఆశ్చర్యానికి గురయ్యా. 15 రోజుల నుంచి నేను మా ఇంటికి దూరంగా ఉంటున్నాను. దీంతో ఈ పుకార్లు సృష్టించి సర్క్యూలేట్ చేశారు. నా పిల్లల గురించే నేను చాలా బాధపడ్డాను.

వాళ్లకు ఈ విషయం తెలిస్తే వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారు.. బిప్లవ్ తనను వేధింపులకు గురిచేస్తున్నాడన్న వార్తలపై స్పందిస్తూ.. ఒకవేళ నేను లీగల్ పిటిషన్ దాఖలు చేసి ఉంటే.. వేరే వాళ్లతో ఈ వార్తను ఎందుకు విస్తృతంగా వైరల్ చేస్తాను. నేనే అందరికీ దీని గురించి చెప్పేదాణ్ని. ఒక మహిళ గురించి ఏదైనా చెప్పడం చాలా సులువు. ఇంతకుముందు మా రాష్ట్ర మంత్రి శంతనా చక్మాను లక్ష్యంగా చేసుకున్నారు..ఈసారి ఏకంగా నన్నే టార్గెట్ చేసి నా భర్తను ఇబ్బందులకు గురిచేస్తున్నారని నితి ఆరోపించారు.

భార్యను బిప్లవ్ దేవ్ వేధిస్తున్నారని, గృహహింసకు పాల్పడ్డారని .. నితి ఆయనకు విడాకులు ఇస్తున్నారని మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. దీనిపై నితి సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ .. అవన్నీ పుకార్లేనని తోసిపుచ్చారు. ఈ మేరకు ఫేస్ బుక్ లో ఆమె పోస్టు పెట్టారు.

Latest Updates