కొంద‌రు సైకోలు త‌ప్పుడు ప్ర‌చారం

హైద‌రాబాద్: క‌రోనా మ‌హ‌మ్మారిని రాష్ట్రంలో శాశ్వ‌తంగా త‌రిమేయ‌డ‌మే మా ఎజెండా అని తెలిపారు మంత్రి ఈట‌ల రాజేంద‌ర్. క‌రోనా అప్డేట్ పై శుక్ర‌వారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. గాంధీ హాస్పిట‌ల్ లో ఫుడ్ స‌రిగ్గా అందించ‌డంలేద‌ని కొంత‌మంది సైకోలు, శాడిస్టులు సోష‌ల్ మీడియాలో త‌ప్ప‌డు పోస్టులు పెడుతున్నార‌న్నారు. క‌రోనా బాధితులకు పోషక విలువలతో కూడిన ఆహారం అందిస్తున్నామని.. గాంధీ హాస్పిట‌ల్ లో ఏ ఒక్క పేషెంట్‌ కూడా సదుపాయాలు సరిగా లేవని చెప్పలేదన్నారు.

ద‌య‌చేసి డాక్ల‌ర్లు, వైద్య సిబ్బంది మ‌నోస్థైర్యం దెబ్బ‌తీయ‌వ‌ద్ద‌న్నారు. అవసరమొస్తే డాక్టర్లు దేవుళ్ళు.. లేకపోతే వెల్లగొడతారా అన్నారు. గాంధీ హాస్పిట‌ల్ ని పూర్తిగా కొవిడ్ హాస్పిట‌ల్ గా మార్చామన్నారు. మరమ్మతులు చేసి కొవిడ్ హాస్పిట‌ల్ కి ఉండే సౌకర్యాలు కల్సించినట్లు తెలిపారు. డాక్ట‌ర్ల‌ను, వైద్య సిబ్బందిని వేధించినా, దాడులకు పాల్పడ్డా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు హెల్త్ మినిష్ట‌ర్ ఈట‌ల రాజేంద‌ర్.

 

Latest Updates