నగ్నంగా డాన్స్ చేయాలంటూ మహిళపై దాడి

some-young-men-attack-a-woman-for-dancing-naked-in-rajendra-nagar

హైదరాబాద్: నగ్నంగా డ్యాన్స్‌ చేయాలంటూ ఓ మహిళపై కొందరు యువకులు దాడికి పాల్పడిన ఘటన నగరంలోని రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఈవెంట్‌ ఆర్గనైజర్‌గా పనిచేసే సదరు మహిళను తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించాల్సిందిగా అమీర్‌ అనే యువకుడు సంప్రదించాడు.  ఆ ఈవెంట్ కు ఆమె ఒప్పుకుంది. ఈ నెల 22న రాత్రి పుట్టినరోజు వేడుకలు జరగ్గా.. రాత్రి వేడుకలు ముగిసిన తర్వాత తాగిన మత్తులో అమీర్‌, అతడి మిత్రులు సుల్తాన్‌, సలీమ్, రాజ్‌అలీ నగ్నంగా నృత్యం చేయాలంటూ మహిళను బలవంతపెట్టారు. ఆమె నిరాకరించటంతో కత్తులతో బెదిరించి గదిలో బంధించారు. డాన్స్ చేయాల్సిందేనంటూ ఆమెపై దాడి చేశారు.

రాత్రంతా గదిలోనే ఉన్న ఆ మహిళ ఎలాగోలా తప్పించుకొని వచ్చి  23వ తేదీన తన భర్తతో కలిసి రాజేంద్రనగర్‌ పీఎస్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు యువకులు కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

Latest Updates