ఎవరో మిస్సయ్యారే?.ఐసీసీ పుల్​ షాట్ల పోల్​పై రోహిత్ సెటైర్​

న్యూఢిల్లీ: ఐసీసీ నిర్వహించిన బెస్ట్ పుల్​షాట్​పోల్​లో తన పేరు లేకపోవడంపై టీమిండియా డాషింగ్​ఓపెనర్​ రోహిత్​శర్మ వ్యంగ్యంగా స్పందించాడు. ఆదివారం ట్విటర్​లో నలుగురు బ్యాట్స్‌‌‌‌మెన్‌‌‌‌ ​ఫొటో పెట్టి.. వీరిలో ఎవరిది బెస్ట్​ పుల్‌‌‌‌షాటో​  చెప్పాలని ​ఐసీసీ ట్వీట్​చేసింది. ఇందులో విండీస్​ దిగ్గజం వివ్​రిచర్డ్స్, ఆసీస్​ గ్రేట్ ​రికీ పాంటింగ్, సౌతాఫ్రికా​మాజీ బ్యాట్స్​మన్ హెర్షల్ ​గిబ్స్ తోపాటు ఇండియా కెప్టెన్ ​విరాట్​ కోహ్లీ కూడా ఉన్నాడు. అయితే పుల్‌‌‌‌షాట్​ స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్న రోహిత్ ను మాత్రం ఐసీసీ ఈ లిస్ట్‌‌‌‌లో చేర్చలేదు. దీంతో రోహిత్ ​స్పందిస్తూ.. ‘ఈ ఫొటోలో ఎవరో మిస్సయినట్టున్నారు? నాకు తెలిసి ఇంటి నుంచి పని చేయడం అంత సులువు కాదు’ అని వ్యంగ్యంగా ట్వీట్​చేశాడు.

Latest Updates