జిమ్ లో ఆర్య వర్కవుట్స్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే.!

ఆర్య పరిచయం అక్కర్లేని పేరు. రాజారాణి, జర్నీ, అల్లు అర్జున్ వరుడు సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితుడు. ఆర్య లేటెస్ట్ గా టెడ్డీ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఆర్య వైఫ్ సాయేషా సైగల్ హీరోయిన్ . శక్తి సౌందర్ రాజన్ డైరెక్షన్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ఆర్య ఫిట్ నెస్ చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. తన శరీరాకృతిని పూర్తిగా చేంజ్ చేశాడు ఆర్య. సిక్స్ ప్యాక్ దేహంతో జిమ్ లో తెగ కష్టపడుతున్నాడు. లేటెస్ట్ గా ఆర్య జిమ్ లో వర్కవుట్ చేస్తున్న ఒక వీడియోను తన ట్విట్టర్లో షేర్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్య 400 కేజీల లెగ్ ప్రెస్ చేస్తూ కనిపిస్తున్నాడు. అంతేగాకుండా లెగ్ ప్రెస్ పై మిస్టర్ జాన్సన్ కూర్చున్నాడు. దీంతో పాటు మిస్టర్ జై హెల్ప్ తో  130 కేజీల బరువును తన భుజాలపై మోశాడు. కొన్ని సార్లు ఇలా అధిక బరువులు మోయాల్సి  వస్తుందని ఆర్య ట్వీట్ చేశాడు.

Latest Updates