తట్టుకోలేని కొడుకు : కన్నతల్లిని, ఆమె ప్రియుడిని నరికి చంపాడు

గద్వాల :  గ్రామంలో గౌరవంగా ఉంటున్నాడు. కానీ కన్నతల్లి ప్రవర్తన అతడి పాలిట పెద్ద శాపంగా మారింది. కన్న తల్లి వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుని కుటుంబ పరువును మంటగలుపుతుంటే సహించలేకపోయాడు ఆ కొడుకు. పద్దతి మార్చుకోవాలని తల్లిని వారించాడు. ఎన్నిసార్లు చెప్పినా తల్లి ప్రవర్తనలో మార్పురాకపోవడంతో కన్నతల్లిని, ఆమెతో అక్రమ సంబంధం నడుపుతున్న ప్రియుడుని అత్యంత దారుణంగా నరికి చంపేశాడు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది.

కర్నూలు జిల్లా గోనగండ్ల మండలం అల్వాలపాడుకు చెందిన తెలుగు బడేసాబ్‌ కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. సి- బెలగల్‌ మండలం గోనేరేవులకు చెందిన తెలుగు శంకరమ్మతో బడేసాబ్ కు వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం తెలిసి శంకరమ్మ కొడుకు తల్లికి వార్నింగ్ ఇచ్చాడు. పలుమార్లు మందలించాడు. అయినా శంకరమ్మ, బడేసాబ్ ల ప్రవర్తనలో ఏమాత్రం మార్పులేదు. వడ్డేపల్లి మండలం కొంకలలో శంకరమ్మ కోడలు శ్యామల ఉంటోంది.

రెండు రోజుల క్రితం బడేసాబ్, శంకరమ్మ ఇద్దరూ శ్యామల ఇంటికి వచ్చారు. అక్కడే రెండు రోజులు గడిపారు. బుధవారం శంకరమ్మ, బడేసాబ్ లు కొంకల గ్రామం నుంచి కర్నూలుకు బయలు దేరారు. ఈ విషయం తెలుసుకున్న శంకరమ్మ కొడుకు రాములు రాజోలి శివార్లలో మాటు వేశాడు. పదునైన ఆయుధంతో శంకరమ్మ, బడేసాబ్ లపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. తర్వాత అక్కడ నుంచి రాములు పరారయ్యాడు. బడే సాబ్ కొడుకు గోపాల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Latest Updates