సరోగసీ ద్వారా పిల్లల్ని కన్న నానమ్మ, అమ్మమ్మ

ఓ తల్లి తన కొడుకు కోసం, మరో తల్లి కూతురు కోసం తల్లులయ్యారు. సరోగసీ విధానంలో గర్భాన్ని మోశారు. పండంటి బిడ్డలకు జన్మనిచ్చారు. ఓ సంఘటన అమెరికాలో, మరోటి బ్రిటన్‌‌లోజరిగింది. అమెరికాకు చెందిన సిసిలీ ఎలెడ్జె(61) కొడుకు మాథ్యూ ఒక గే. ఎల్లియట్‌‌ డాగర్టీని పెళ్లి చేసుకున్నాడు . ఇద్దరూ ఐవీఆర్‌‌ ద్వారాపిల్లల్ని కనాలనుకున్నారు. ఎల్లియట్‌‌ చెల్లి లియా సాయం తీసుకున్నారు. లియా అండం, మాథ్యూ స్పెర్మ్‌‌తో పిండాన్ని డాక్టర్లు అభివృద్ధి చేశారు. సిసిలీ గర్భం లో ప్రవేశపెట్టారు. సోమవారం సిసిలీ తన మనవరాలు ఉమాకు జన్మనిచ్చిం ది.

మరో ఘటనలో బ్రిటన్‌‌కు చెందిన ఎమ్మా మైల్స్‌‌(55) గర్భాశయం లేని తన కూతురు ట్రేసీ స్మిత్‌ (31) కోసం తల్లయింది. సరగోసీ విధానంలో పిండాన్ని మోసింది. భర్త స్పెర్మ్‌‌, ట్రేసీ అండంతో పిండాన్ని అభివృద్ధి చేశారు డాక్టర్లు. ఎమ్మా గర్భాశయంలో ప్రవేశపెట్టారు. జనవరి 16న పండంటి బిడ్డకు జన్మనిచ్చింది ఎమ్మా. బిడ్డ ఆరోగ్యం గా ఉంది. 3.3 కేజీల బరువుంది. పిండాన్ని మోసేం దుకు ఆరోగ్యంగా ఉండాలని డాక్టర్లు చెప్పడంతో 38 కేజీల బరువు తగ్గింది ఎమ్మా.

 

Latest Updates