జాబ్‌ మానేసి చదువుకోమన్నందుకు ఆత్మహత్య

son commits suicide because of father was reprimanded

ఎల్ బీ నగర్,వెలుగు : తండ్రి మందలించాడని మనస్థాపానికి గురై ఓ కొడుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వనస్థలిపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కమలానగర్ కు చెందిన నరికొండ వాసుకు ఇద్దరు కొడుకులు. చిన్న కొడుకైన గణేశ్(20) నగరంలోని బాలానగర్ లోని సీఐటిడి కళాశాలలో రెండేళ్ల క్రితం డిప్లొమా చదివాడు. నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో అప్పటి నుండి ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ పరీక్షలు రాస్తున్నాడు. వచ్చే నెలలో మళ్లీ పరీక్షలు రాయాల్సి ఉండగా బుధవారం ఇంటికి లేటుగా వచ్చాడు.దీంతో తండ్రి కోపగించుకున్నాడు. ‘పరీక్షలు వస్తున్నాయ్‌. ఇంటికి తొందరగా వచ్చి చదువుకోవచ్చుగా. నువ్వు జాబ్ మానేసి పరీక్షలు పాస్‌‌‌‌‌‌‌‌ కావడానికి ప్రయత్నం చెయ్‌ ’ అని సుతిమెత్తగా మందలిం చాడు. దీంతో మనస్థాపానికి గురైన గణేశ్‌‌‌‌‌‌‌‌ గురువారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Latest Updates