పండగపూట అత్తమామలపై దాడి చేసిన అల్లుడు

కామారెడ్డి: పండగపూట ఓ ఇంట్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. తనపై కేసు పెట్టారనే కోపంతో అత్తామామలపై అల్లుడు దాడిచేసిన ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. భిక్కనూర్‌కు చెందిన స్వప్న, గోపాల్ దంపతుల మధ్య పరస్పరం గొడవలు జరగుతుండేవి. దాంతో స్వప్ప భిక్కనూర్‌లోని తల్లిగారింట్లో ఉంటుంది. కూతురు, అల్లుడు మధ్య ఉన్న గొడవలతో విసుగుచెందిన స్వప్న తల్లిదండ్రులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాంతో అత్తమామలపై కక్ష పెంచుకున్న గోపాల్.. బుధవారం అర్ధరాత్రి స్వప్న ఇంటికి చేరుకొని ఆమె తల్లిదండ్రులపై దాడి చేశాడు. ఈ దాడిలో స్వప్న తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు చికిత్స నిమిత్తం వారిని కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించారు.

For More News..

వీడియో వైరల్.. దర్బార్ పాటకు చిందేసిన కిరణ్ బేడి

మంచుగడ్డల కింద 18 గంటలు నరకం చూసిన 12 ఏళ్ల బాలిక

బాత్రూంలో ఉన్న ఫొటోలతో మాజీ మిస్ ఇండియాకు వేధింపులు

 

Latest Updates