దారుణం..తండ్రిని ముక్కలు ముక్కలుగా నరికాడు

son-killed-father-at-malkajgiri-hydrebad

హైదరాబాద్ మల్కాజ్ గిరిలో దారుణం జరిగింది.కన్నతండ్రిని అతి దారుణంగా నరికి చంపాడు కొడుకు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

స్థానికుల వివరాల ప్రకారం మౌలాలి ఆర్టీసీ కాలనీలో  భార్య, కొడుకుతో మారుతీ అనే వ్యక్తి ఉంటున్నాడు. కొడుకు కిషన్ మూడు రోజుల క్రితం తండ్రిని ముక్కులు ముక్కలుగా నరికి బకెట్లో దాచిపెట్టాడు. దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్లూస్ టీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బకెట్ ను ,మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిందితులు తల్లీ, కొడుకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Latest Updates