45రోజులుగా తండ్రి ఆచూకీ గల్లంతు.. కొడుకుని నిలదీయగా బయటపడ్డ నిజం

రంగారెడ్డి జిల్లా: చేవెళ్ళ మండలంలోని గుండాల గ్రామంలో దారుణం జ‌రిగింది. కన్నతండ్రిని తల్లితో కలిసి చంపాడో వ్య‌క్తి. గుండాల గ్రామానికి చెందిన సాలే కిష్టయ్య 45 రోజులుగా క‌నిపించ‌క‌పోవ‌డంతో అత‌ని కుటుంబ సభ్యులు అత‌ని ఆచూకీ కోసం వెతకడం ప్రారంభించారు. గురువారం కిష్టయ్య కొడుకు ర‌మేష్ పై అనుమానంతో నిలదీయగా.. తన తండ్రిని తానే హ‌త్య చేసిన‌ట్లు ఒప్పుకున్నాడు. తల్లి లలిత తో కలిసి తండ్రిని చంపి త‌మ‌ పొలంలో పాతి పెట్టామని తెలిపాడు. ఆ త‌ర్వాత‌ పొలంలో ఉన్న శవం వద్దకి బంధువులను తీసుకెళ్లి చూపించాడు. ఈ విష‌యంపై బంధువులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్న చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates