వైరల్ పోస్ట్: తల్లికి మళ్లీ పెండ్లి చేశానన్న కొడుకు

son-make-remarriage-to-his-mother-in-kerala

ఫేస్‌బుక్‌లో కేరళ యువకుడి పోస్టు.. నెటిజన్ల ప్రశంసలు

ఇలాంటి ఒక నోట్‌‌‌‌ రాసే ముందు నేను చాలా ఆలోచించాను. మళ్లీ పెళ్లి చేసుకున్న నీకు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అమ్మా. అనుమానం, జాలి, ద్వేషం లాంటి భావాలు కలిగిన వాళ్లు ఈ పోస్టు వంక చూడకండి. మీరేమన్నా సరే. దాన్ని పట్టించుకునే వాళ్లెవరూ ఇక్కడ లేరు. అవును ఈ పోస్టు మా అమ్మ పెళ్లి గురించి..’ అంటూ కేరళకు చెందిన ఇంజనీర్ గోకుల్‌‌‌‌ శ్రీధర్‌‌‌‌ ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌లో పెట్టిన పోస్టు అందరినీ ఆలోచింపజేస్తోంది. 

కేరళలోని కొల్లాంకు చెందిన శ్రీధర్‌‌‌‌ తల్లిదండ్రులతో కలిసి జీవించేవాడు. తండ్రి తరచూ తల్లిని చిత్రహింసలు పెట్టేవాడు. ఓ రోజు తల్లిని, తండ్రి గోడకేసి కొట్టాడు. దాంతో ఆమె తల నుంచి రక్తం కారింది. ఇది చూసిన శ్రీధర్ గుండె తల్లడిల్లిపోయింది. ‘‘అమ్మా ఎందుకు ఇంకా భరిస్తున్నావ్’’ అని అడిగాడు. అందుకు అమ్మ ఇచ్చిన సమాధానం.. ‘‘నీ కోసమే బతుకుతున్నా.. ఇంకా ఎంతైనా భరిస్తా’’ అని.  ఆ తర్వాతి రోజే తల్లిని తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు శ్రీధర్. వెంటనే అమ్మకు మరో మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేశాడు. ఆ ఫొటోనే ఫేస్ బుక్‌‌‌‌లో పెట్టాడు. ‘‘నా కోసం అమ్మ జీవితాన్ని ధారపోసింది. ఆమెకు ఇంతకన్నా నేనేం చేయగలను.  ఇక నేను చెప్పాల్సిందేమీ లేదు’’ అంటూ శ్రీధర్ తన పోస్టును ముగించాడు. గోకుల్ పోస్టు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. నెటిజన్లు అతడి నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు.

അമ്മയുടെ വിവാഹമായിരുന്നു.ഇങ്ങനെ ഒരു കുറിപ്പ് വേണോ എന്ന് ഒരുപാട് ആലോചിച്ചതാണ്, രണ്ടാം വിവാഹം ഇപ്പോഴും അംഗീകരിക്കാൻ…

Gokul Sreedhar 发布于 2019年6月11日周二

Latest Updates