డిప్యూటీ స్పీకర్ కొడుకు డబ్బులు పంచుతున్నారంటూ కాంగ్రెస్ కార్యకర్తల ఆరోపణ

సికింద్రాబాద్ బౌద్ధనగర్ డివిజన్ లో డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ కొడుకు కిరణ్ గౌడ్ డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు. డబ్బులు పంచుతూ దొరికి..ఇంచార్జ్ అని బెదిరించాడని ఆరోపించారు. అయితే ఆయనకు బౌద్ధనగర్ తో ఎలాంటి సంబందం లేదంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఓటర్లను కిరణ్ గౌడ్ ప్రలోభాలకు గురిచేస్తున్నా అధికారులు, పోలీసులు పట్టించుకోలేదన్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవటంతో తోపులాట జరిగింది.

Latest Updates