కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అడ్వైజర్ ఫ్యామిలీలో కరోనా

  • కొడుకు, భార్యకు వైరస్ పాజిటివ్

జమ్మూ: జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ జీసీ ముర్ము అడ్వైజర్ ఫ్యామిలీలో కరోనా కలకలం రేపింది. అడ్వైజర్ భార్య, కొడుకుకు కరోనా పాజిటివ్ కన్ఫామ్ అయినట్లు అధికార వర్గాలు సోమవారం మీడియాకు వెల్లడించాయి. దీంతో అడ్వైజర్ సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నారని, ఆయన భార్య, కొడుకును రియాసి జిల్లాలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పాయి. అడ్వైజర్ భార్య, కొడుకు కొద్ది రోజుల కిందట ఢిల్లీ నుంచి తిరిగి వచ్చి గెస్ట్ హౌస్​లో ఉంటున్నారని, వారి శాంపిల్స్ టెస్టులకు పంపగా.. రిజల్ట్ పాజిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. అడ్వైజర్ నుంచి కూడా శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కి పంపించామన్నారు. గెస్ట్ హౌస్ వద్ద కాంటాక్ట్ ట్రేసింగ్ జరుగుతోందన్నారు.

Latest Updates