బాలీవుడ్‌‌‌లో ‘సెక్సిజం’పై సోనమ్ కపూర్ కామెంట్స్

ముంబై: హిందీ హీరోయిన్, సీనియర్ హీరో అనిల్ కపూర్ గారాలపట్టి సోనమ్ కపూర్ చాలా విషయాలపై నిర్భయంగా కామెంట్ చేస్తూ ఉంటుంది. తాజాగా బాలీవుడ్‌‌లో సెక్సిజంపై ఆమె స్పందించింది. హిందీ సినిమా పాటల్లో మహిళలపై రాస్తున్న సాహిత్యంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని సోనమ్ వ్యాఖ్యానించింది. ఇండస్ట్రీలో మహిళలు తమ కోసం తాము నిలబడి పోరాడాలని చెప్పింది.

‘కెరీర్‌‌లో సక్సెస్ కావాలంటే పెద్ద హీరోలతోనే నటించాలని చాలా మంది ఇంకా నమ్ముతున్నారు. అందుకోసం ఫిమేల్ యాక్టర్స్ ఫలానా విధంగా ప్రవర్తించాలని, ఫలానా రకాల డ్రస్సులే వేసుకోవాలని భావిస్తున్నారు. డ్రెస్సింగ్‌తోపాటు మహిళలపై అసభ్యంగా తీయాలనుకునే స్క్రిప్ట్ నచ్చకపోతే సినిమాలను తిరస్కరించాలి. అటువంటి సెక్సీయెస్ట్ మూవీలకు నో చెప్పాలి. మహిళలపై వస్తున్న స్క్రిప్ట్‌‌లు, పాటల్లో చరణాలు రాసే విధానాల్లో మార్పు రావాలి. ఇండస్ట్రీలో మహిళలపై వస్తున్న సినిమాలు అస్సలు బాగోలేవు. ఇలాంటి సినిమాల్లో మనం పని చేయకూడదు. ఎందుకంటే వీటిల్లో నటిస్తే మొత్తం ఫిమేల్ యాక్టర్స్‌‌కు హాని కలిగిస్తున్నట్లే. మనందరం మంచి ఎంపికలతో ముందుకెళ్లాలి’ అని హీరోయిన్లకు సోనమ్ సూచించింది.

Latest Updates