ఆస్కార్‌ లైబ్రరీకి సోనమ్‌ సినిమా

ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్‌ కపూర్‌ కుమార్తె సోనమ్‌ కపూర్‌…బాలివుడ్ సినీ నటి తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. అంతేకాదు ‘నీరజ’ సినిమాలో తన నటనకు జ్యూరీ విభాగంలో ఉత్తమ నటి అవార్డు కూడా సొంతం చేసుకుంది. తాజాగా  సోనమ్  మరో అరుదైన గౌరవం దక్కించుకోనుంది. తాను నటించిన ‘ఏక్‌ లడ్‌కీ కో దేఖా తో ఐసా లగా’ సినిమాను ఆస్కార్‌ లైబ్రరీలో చేర్చనున్నారు. మూవీకి సంబంధించిన ఓ కాపీని అందించాలని.. దాన్ని లైబ్రరీ కోర్‌ కలెక్షన్స్‌లో ఉంచుతామని ‘అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌’ సంస్థ సినిమా నిర్మాతలను కోరిందట. ఈ విషయం తెలిసిన సోనమ్‌ కపూర్‌ ఆనందం వ్యక్తం చేశారు. ‘‘ నేను మా నాన్నతో నటించిన మొదటి సినిమా ఇది. ఇప్పుడు ఈ సినిమా ఆస్కార్‌ లైబ్రరీలోనూ ఉంచడం ఆనందాన్ని కలిగిస్తోంది’’ అంటూ సోనమ్‌ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.

స్వలింగ సంపర్కం అనే అంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో టాలీవుడ్‌ భామ రెజీనా, అనిల్‌ కపూర్‌, రాజ్‌కుమార్‌ రావు, జూహీ చావ్లా కీలక పాత్రల్లో నటించారు. షెల్లీచోప్రా ధార్‌ దర్శకత్వం వహించారు.

Latest Updates