వైద్య పరీక్షలకై విదేశాలకు సోనియా, తోడుగా రాహుల్

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ వైద్య చికిత్సలో భాగంగా చెకప్ కోసం విదేశాలకు వెళ్లారు. ఆమెతోపాటు రాహుల్ గాంధీ కూడా తల్లి వెంట విదేశాలకు వెళ్లారు. రెండు వారాలు పాటు వైద్య ప‌రీక్ష‌ల అనంత‌రం.. తిరిగి ఇండియాకు రానున్నట్టు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా తెలిపారు. రొటీన్‌గా జరగాల్సిన వైద్య పరీక్షలు ..కోవిడ్ పరిస్థితుల కారణంగా రెండు వారాల ఆల‌స్య‌మ‌వుతుంద‌ని ఆయ‌న అన్నారు. విదేశాల నుంచి తిరిగొచ్చిన తర్వాత సోనియా, రాహుల్ లు పార్లమెంట్ సమావేశాలకు హాజరు కానున్నట్టు తెలిపారు.

 

Latest Updates