మీ ట్రైన్ టికెట్ చార్జీలు సోనియా చెల్లించారు

  • వలస కూలీలతో కాంగ్రెస్ ఎమ్మెల్యే

న్యూఢిల్లీ:  వలస కూలీలను తరలించేందుక కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నడుపుతున్న శ్రామిక్ రైళ్లో ప్యాసింజర్లకు పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అమరీందర్ రాజా కరపత్రాలు పంచారు. మీ టెకెట్ చార్జీలు కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ చెల్లించారు అంటూ ప్రచారం చేశారు. ఆదివారం పంజాబ్ నుంచి వలస కూలీలతో బీహార్ కు బయల్దేరిన రైలు బటిండా స్టేషన్ లోకి రాగానే ఎమ్మెల్యే రాజా ప్యాసింజర్లకు.. సోనియా గాంధీ మీ టికెట్ చార్జీలను చెల్లించారని రాసి ఉన్న పాంప్లెట్స్ ను పంచారు. రైలు బయల్దరడానికి ముందు ఆయన కొద్ది సేపు ప్రసంగించారు.
‘‘ప్రతి నిరుపేద కార్మికుడు, వలస కూలీకి సాయం చేసేందుకు టికెట్ చార్జీలను తామే చెల్లిస్తామని కాంగ్రెస్ చీఫ్​ సోనియా గాంధీ కిందటివారం ప్రకటించారు. మీ టికెట్ ఛార్జీలను సోనియా గాంధీ చెల్లించారు. సీఎం అమరీందర్ సింగ్, పీసీసీ చీఫ్ సునీల్ జఖర్ మిమ్మల్ని రైల్లో తరలిస్తున్నారు. ప్రతిదీ ఈ కరపత్రంలో రాసిఉంది. మీ ప్రయాణంలో విశ్రాంతి సమయంలో చదవండి”అని రాజా ప్రయాణికులనుద్దేశించి అన్నారు.

Latest Updates