తీహార్ జైలుకు సోనియా.. డీకే శివకుమార్ కు పరామర్శ

మనీ లాండరింగ్  కేసులో  తీహార్ జైలులో  ఉన్న కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత   డీకే శివకుమార్ ను కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ కలిశారు. ఆయన ఆరోగ్య  పరిస్థితిని  సోనియా ఆరా తీశారు.  మనీ లాండరింగ్ కేసులో ఆగస్టు   31న మొదటిసారి  డీకే శివకుమార్ ను ఈడీ అధికారులు  ప్రశ్నించారు. ఐదు రోజుల విచారణ తర్వాత  సెప్టెంబర్  3న  అరెస్ట్ చేశారు. అప్పటినుంచి  తీహార్ జైలులో ఉన్నారు డీకే శివకుమార్. ఇటీవలే  కాంగ్రెస్ సీనియర్  నేతలు  కూడా జైలుకు వెళ్లి డీకే  శివకుమార్ ను  పరామర్శించారు. గత ఏడాది శివకుమార్ ఇంట్లో  ఐటీ అధికారులు  దాడులు  చేసి  8 కోట్ల 59 లక్షల రూపాయలు  స్వాధీనం చేసుకున్నారు.

 

Latest Updates