శివసేనకు మద్దతుకు సోనియా గ్రీన్ సిగ్నల్

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేనకు…. కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  మహారాష్ట్రలో శివసేనకు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ చైర్ పర్సన్, పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ అంగీకరించారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ   చీఫ్ శరద్ పవార్ తో సోనియా భేటీ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని కాంగ్రెస్ నేతలను ఆమె ఆదేశించారు. దీంతో  న్యూఢిల్లీలోని 6 జన్ పథ్  లోని ఎన్సీపి నేత ప్రియా స్యూలే నివాసంలో కాంగ్రెస్, ఎన్సీపి నేతలు సమావేశం కానున్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై సమావేశంలో ఇరు పార్టీల నేతలు చర్చించనున్నారు. కేబినెట్ పొర్ట్ పొలియో పంపిణీకి సంబంధించి పలు అంశాలపై చర్చించనున్నారు. సోనియాతో పవార్ భేటీతో రాష్ట్రంలో శివసేనతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమైనట్టు కనిపిస్తోంది. మరోవైపు ప్రధాని మోడీతో ఎన్సీపీ నేత శరద్ పవార్ భేటీ తర్వాత మహారాష్ట్ర రాజకీయాలు శరవేగంగా మారిపోయాయి. శివసేనకు మద్దతిచ్చేందుకు కాంగ్రెస్ ముందుకు రావడంతో ఇప్పుడు అందరి దృష్టి ప్రభుత్వ ఏర్పాటుపైనే పడింది.  ఎన్నో ఏళ్ల వైరాన్ని పక్కనపెట్టి శివసేనతో జతకట్టే విషయంలో కాంగ్రెస్ తర్జనభర్జన పడుతూ వచ్చింది. తమ నిర్ణయాన్ని నాన్చుతూ వచ్చి చివరికి శివసేనతో కలిసి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు రెడీ అయినట్లు సమాచారం.

Latest Updates