రేపు రాయ్ బరేలికి సోనియా, ప్రియాంక

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని తన సొంత నియోజకవర్గం రాయ్ బరేలికి బుధవారం వెళ్తున్నారు కాంగ్రెస్ అధినేత్రి, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ. లోక్ సభ ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఒకే ఒక్క సీట్ రాయ్ బరేలి. ఈ సెగ్మెంట్ లో బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్ మీద 1లక్ష 67వేల పైచిలుకు మెజారిటీతో సాధించారు సోనియాగాంధీ. ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించిన తర్వాత మొదటిసారి రాయ్ బరేలిలో పర్యటిస్తున్నారామె. సోనియాకు ఘనస్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమయ్యాయి.

రాయ్ బరేలీలో సోనియాగాంధీతో పాటు… యూపీ తూర్పు ఇంచార్జ్ ప్రియాంకా గాంధీ కూడా పర్యటించనున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో పూర్వాంచల్ ఇంచార్జ్ గా బాధ్యతలు నిర్వర్తించారు ప్రియాంక. ఐతే.. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిజాస్టర్ ఫలితాలు సాధించింది. సోనియాతోపాటు.. ప్రియాంక.. యూపీలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇంచార్జులతో సమావేశం అవుతారు. పార్టీని బూత్ లెవెల్లో పటిష్టపరిచే చర్యలపై చర్చలు జరుపుతారు.

Latest Updates